విధాత: ఏపీ పోలీస్ అధికారుల సంఘం వ్యాఖ్యల పై స్పందించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయన్నపాత్రుడు మాట్లాడుతూ ఏపీలో అరాచకాలు జరిగినప్పుడు, పోలీసులే అఘాయిత్యాలకు పాల్పడినప్పుడు కనీసం ఖండన కూడా ఇవ్వని పోలీస్ అధికారుల సంఘం, మీడియాలో రిపోర్ట్ అయిన వార్తలపై నారా లోకేష్ స్పందిస్తే… ఖండఖండాలుగా ఖండించడం ఏ తప్పు కప్పిపుచ్చుకోవడానికి? ఎవరి మెప్పు పొందడానికి? అని మండి పడ్డారు.
తప్పు చేయకపోతే కానిస్టేబుల్ ని ఎందుకు సస్పెండ్ చేశారు?.బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వకపోతే కానిస్టేబుల్ అత్యాచారం చేయొచ్చా? సంఘం ప్రకటించినట్టు పోలీసులు మహిళల రక్షణ కోసం పనిచేస్తుంటే…రాష్ట్రంలో 500 మంది మహిళలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఎలా జరిగాయి? మీ యజమాని పత్రిక సాక్షిలో కూడా అత్యాచారం వార్త వచ్చింది కదా! వివక్ష చూపకుండా విధులు నిర్వర్తించే వారికి సెల్యూట్ చేస్తాం.