నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కన్నుమూత
విధాత: ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా కరోనాతో బాధ పడు తున్న ఆయన కొదిసేపటి క్రితమే కన్ను మూశారు. కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన ఆరోగ్యం విషమించింది. కరోనా భారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్నారు.. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు. ఇక మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ […]

విధాత: ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా కరోనాతో బాధ పడు తున్న ఆయన కొదిసేపటి క్రితమే కన్ను మూశారు. కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన ఆరోగ్యం విషమించింది. కరోనా భారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్నారు.. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు.
ఇక మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ తన తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకిందని..75శాతం ఇనెఫెక్షన్ ఉండడంతో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శివశంకర్ మాస్టర్ కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తమిళ, తెలుగు చిత్రాలతో సహా 10 భాషల్లోని 800లకు పైగా చిత్రాల్లో పాటలకు ఆయన నృత్యాలు సమకూర్చారు. అత్యధికంగా దక్షిణాది భాషా చిత్రాలకు పనిచేశారు. శివ శంకర్‌కు ఇద్దరు కుమారులు. విజయ్ శివ శంకర్, అజయ్ శివ శంకర్ ఇద్దరూ డ్యాన్స్ మాస్టర్లే.