జగన్ లాంటి వ్యక్తిని జీవితంలో చూడలేదు: సీఎం చంద్రబాబు

జగన్ లాంటి వ్యక్తిని చూడలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. అమరావతి ఏకైక రాజధాని అని స్పష్టం చేస్తూ మూడు రాజధానుల విధానంపై మండిపడ్డారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Apr 01, 2026, 4:15 pm IST
Read Time: 4 mins
జగన్ లాంటి వ్యక్తిని జీవితంలో చూడలేదు: సీఎం చంద్రబాబు

అమరావతి : ‘నా జీవితంలో వైసీపీ లాంటి పార్టీని, జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు’ అని.. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందించారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు.వింజమూరులో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ రాష్ట్రాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను విధ్వంసం చేసిందని,మూడు రాజధానుల పేరిట మూడుముక్కలాటతో ప్రజల మధ్య విద్వేషాలను రగిలించిందని విమర్శించారు.అమరావతి తీర్మానం రోజున వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాలేదన్నారు. అమరావతి ఏకైక ప్రజా రాజధాని అని… ఇక ఇంచు కూడా ఎవ్వరూ కదిలించలేరని స్పష్టం చేశారు.

ఏపీకి అమరావతే ఏకైక రాజధాని

అమరావతికి చట్టబద్ధత బిల్లును లోక్‌సభలో బిల్లు ఆమోదం ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిని ఎవరూ టచ్‌ చేయలేరని చెప్పారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో ఫించన్లు పంపిణీ చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 63 లక్షల మందికి ఫించన్లు ఇస్తున్నామని, ఫించన్లను మొక్కుబడిగా కాకుండా గౌరవంగా ఇంటి వద్దే ఇచ్చే కార్యక్రమం చేపట్టామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫించన్లు, తల్లికి వందనం ఇచ్చామని తెలిపారు. స్త్రీశక్తి సూపర్ సక్సెస్ అయిందని.. ఆడబిడ్డలు దర్జాగా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తున్నారన్నారు. ‘మా ఆడబిడ్డల కోసం దీపం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. పీఎంజీ కనెక్షన్ తీసుకున్నా.. ఏడాదికి రూ.2,465లు సబ్సిడీ ఇస్తాం అని చంద్రబాబు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Amaravati Capital Bill : రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Srisailam Dam : శ్రీశైలం జలశయాన్ని పరిశీలించిన సీడబ్ల్యుసీ టెక్నికల్ కమిటీ