అమిత్ షాతో సీఎం జగన్ భేటీ
విధాత,న్యూ ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం జగన్ చర్చించేందుకు అవకాశం ఉంది. పోలవరం పెండింగ్ నిధులు, పోలవరం తుది డీపీఆర్ ఆమోదం, గృహ నిర్మాణ పథకంలో కేంద్ర నిధుల పెంపుపై చర్చించనున్నట్లు సమాచారం. అంతకుముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ […]

విధాత,న్యూ ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం జగన్ చర్చించేందుకు అవకాశం ఉంది. పోలవరం పెండింగ్ నిధులు, పోలవరం తుది డీపీఆర్ ఆమోదం, గృహ నిర్మాణ పథకంలో కేంద్ర నిధుల పెంపుపై చర్చించనున్నట్లు సమాచారం.
అంతకుముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో చర్చించారు.