వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడుపైనా సీఎం సమీక్ష

విధాత‌:కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు.45 ఏళ్లకు పైబడ్డవారు, గర్భిణీలు, టీచర్లకు వ్యాక్సినేషన్‌లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వైస్‌.జగన్ ఆదేశం.ఆగస్టు 16న స్కూల్స్‌ ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించేలా చూడాలిఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా వుండాల‌న్నారు.పెళ్లిళ్ల సహా శుభకార్యాల్లో వీలైనంత తక్కువమంది ఉండేలా చూడాల‌ని కోవిడ్‌ నివారణా చర్యలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని,పెళ్లిళ్లల్లో […]

  • Publish Date - August 2, 2021 / 10:28 AM IST

విధాత‌:కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు.45 ఏళ్లకు పైబడ్డవారు, గర్భిణీలు, టీచర్లకు వ్యాక్సినేషన్‌లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వైస్‌.జగన్ ఆదేశం.ఆగస్టు 16న స్కూల్స్‌ ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించేలా చూడాలిఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా వుండాల‌న్నారు.పెళ్లిళ్ల సహా శుభకార్యాల్లో వీలైనంత తక్కువమంది ఉండేలా చూడాల‌ని కోవిడ్‌ నివారణా చర్యలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని,పెళ్లిళ్లల్లో 150 మందికే పరిమితం చేయాలని సీఎం ఆదేశాలు.

వీటితోపాటు ఊరేగింపులు, మతపరమైన కార్యక్రమాల్లో కూడా ఎక్కువ గుమిగూడకుండా మాస్కులు వేసుకునేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.అధికారులు దీనిపై మార్గదర్శకాలు జారీచేయాలన్న సీఎం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగేంతవరకూ జాగ్రత్తలు తప్పనిసరి అన్నారు.వచ్చే రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశాలు

కచ్చితమైన నిర్ధారణల కోసం ఆర్టీపీసీఆర్‌ టెస్టులు మాత్రమే చేయాలని,దీనివల్ల పరీక్షల్లో కచ్చితమైన నిర్ధారణలు వస్తాయన్న సీఎం ఇంటింటికీ సర్వే కొనసాగాలని, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు త‌ప్ప‌నిస‌రి అన్నారు 104 నంబర్‌ యంత్రాంగం సమర్థవంతగా సేవలందించేలా నిరంతరం తగిన పర్యవేక్షణ, సమీక్ష చేయాలన్నారు.

విలేజ్‌ క్లినిక్స్‌ నిర్వహణపై వివరాలు అందించిన అధికారులు బీఎస్సీ నర్సింగ్, సీపీసీహెచ్‌ కోర్సు చేసిన ఎంఎల్‌హెచ్‌పీని విలేజ్‌క్లినిక్స్‌లో పెడతామని,వీరితోపాటుఏఎన్‌ఎం ఒకరిని విలేజ్‌క్లినిక్స్‌లో ఉంచుతామన్నారు. ఆశావర్కర్లు కూడా అక్కడే రిపోర్టు చేయాలని సీఎం ఆదేశించ‌గావిలేజీ క్లినిక్స్‌లో 12 రకాల ప్రాథమిక వైద్య సదుపాయాలు,14 రకాల టెస్టులు,65 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నామన్న అధికారులు.దీంతోపాటు టెలీమెడిసిన్‌ సేవలు కూడా అందుతాయన్న అధికారులు
అవుట్‌పేషెంట్‌ ఎగ్జామినేషన్‌ రూం, లేబొరేటరీ, ఫార్మసీ, వెయిటింగ్‌ హాల్, ఏఎన్‌ఎం క్వార్టర్స్‌కూడా అక్కడే ఉంచుతున్నామని దీనివల్ల 24 గంటలపాటు ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారని 67 రకాల బేసిక్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ కూడా అందుబాటులో ఉంటాయన్న అధికారులు.

ఆరోగ్య శ్రీ కార్డుల ద్వారా సంబంధిత వ్యక్తి వివరాలన్నీ కూడా విలేజ్‌క్లినిక్స్‌కు అందుబాటులో ఉండాలని ఆరోగ్య శ్రీ కార్డు క్యూ ఆర్‌కోడ్‌ ద్వారా ఈ వివరాలన్నీ కూడా వెంటనే తెలిసేలా చూడాలని,ఇదివరకే సేకరించిన డేటా వివరాలన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీ కార్డుతో అనుసంధానం చేసి నిర్దేశిత సమయంలోగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్న సీఎం.

ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇంచార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.