సీఎం జగన్‌ తిరుపతి పర్యటన ఖరారు

విధాత: సీఎం జగన్‌ శనివారం సాయంత్రం తిరుపతి పర్యటన ఖరారైంది. ఇవాళ తిరుపతి వెళ్లనున్న ముఖ్యమంత్రి.. తిరిగి రాత్రి 1 గంటకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. మళ్లీ ఆదివారం మధ్యాహ్నం తిరుపతి బయల్దేరి వెళ్లి, అక్కడ జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. శనివారం సాయంత్రం 6.15కు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు స్వాగతం పలుకుతారు. అనంతరం తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అదే రోజు […]

సీఎం జగన్‌ తిరుపతి పర్యటన ఖరారు

విధాత: సీఎం జగన్‌ శనివారం సాయంత్రం తిరుపతి పర్యటన ఖరారైంది. ఇవాళ తిరుపతి వెళ్లనున్న ముఖ్యమంత్రి.. తిరిగి రాత్రి 1 గంటకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. మళ్లీ ఆదివారం మధ్యాహ్నం తిరుపతి బయల్దేరి వెళ్లి, అక్కడ జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు.

శనివారం సాయంత్రం 6.15కు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు స్వాగతం పలుకుతారు. అనంతరం తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు.

అదే రోజు రాత్రి 11.30కి తిరుపతి విమానాశ్రయం నుంచి బయల్దేరి రాత్రి 1 గంటకు తాడేపల్లికి చేరుకుంటారు. మళ్లీ తిరిగి ఆదివారం మధ్యాహ్నం 1.15కు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి తిరుపతి వెళ్తారు. తాజ్‌ హోటల్‌లో మధ్యాహ్నం జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు.