ఢిల్లీ బయల్దేరిన సీఎం వైఎస్‌ జగన్‌

విధాత‌,ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరారు. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. హోంమంత్రి అమిత్‌ షా, జల వనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, రైల్వే శాఖ మంత్రి గోయల్‌ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్‌ కలుసుకుంటారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చిస్తారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, బాలశౌరి ఉ‍న్నారు.