కరోనా మరణాలు..ప్రభుత్వ హత్యలే: లోకేశ్
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే సీఎం జగన్‌ను నమ్ముకున్న దేవుడైనా క్షమించడని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. హిందూపురం ఆస్పత్రిలో కరోనా బాధితులు ఆక్సిజన్ అందక చనిపోయిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని.. సీఎం ఇందుకు బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపునకు వాడే అధికార యంత్రాంగాన్ని ఇకనైనా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు […]

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే సీఎం జగన్‌ను నమ్ముకున్న దేవుడైనా క్షమించడని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. హిందూపురం ఆస్పత్రిలో కరోనా బాధితులు ఆక్సిజన్ అందక చనిపోయిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.
ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని.. సీఎం ఇందుకు బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపునకు వాడే అధికార యంత్రాంగాన్ని ఇకనైనా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వినియోగించాలని హితవు పలికారు. ఆక్సిజన్ సరఫరాపై దృష్టి పెట్టకుండా అధికారులు, పోలీసులు, వాలంటీర్లను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకున్నారని విమర్శించారు