ముస్లింలకు డిప్యూటీ సీఎం రంజాన్ శుభాకాంక్షలు
విధాత(నరసన్నపేట): ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ ప్రార్ధనలు నిర్వహించుకోవాలని కోరారు. రంజాన్ పండుగ మత సామరస్యానికి, సహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ శుభ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్య మాసానికి రంజాన్ ఒక ముగింపు వేడుకనీ, ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి […]

విధాత(నరసన్నపేట): ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ ప్రార్ధనలు నిర్వహించుకోవాలని కోరారు. రంజాన్ పండుగ మత సామరస్యానికి, సహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ శుభ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్య మాసానికి రంజాన్ ఒక ముగింపు వేడుకనీ, ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని తెలిపారు. ముస్లిం సోదరులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ గురువారం ఉదయం విడుదల చేసిన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు చెప్పారు .