తెలంగాణ బీజేపీలోకి దివ్యవాణి!
విధాత: కొన్నాళ్లుగా ఏపీ టీడీపీలో హడావుడి చేసిన సినీనటి దివ్యవాణి బీజేపీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారా.. అందుకే ఈటల రాజేందర్‌ను కలిశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఆమె ఆ మధ్య టీడీపీలో హడావుడి చేశారు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. తరువాత తనకు పార్టీలో ప్రాధాన్యం వస్తుందని ఆశించినా ఆమెకు పెద్ద ప్రయార్టీ దక్కలేదు. మొన్న మేలో జరిగిన పార్టీ మహానాడులో తనకు ప్రసంగించే అవకాశమూ దక్కకపోవడంతో పార్టీకి రిజైన్ […]

విధాత: కొన్నాళ్లుగా ఏపీ టీడీపీలో హడావుడి చేసిన సినీనటి దివ్యవాణి బీజేపీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారా.. అందుకే ఈటల రాజేందర్‌ను కలిశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఆమె ఆ మధ్య టీడీపీలో హడావుడి చేశారు.
అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. తరువాత తనకు పార్టీలో ప్రాధాన్యం వస్తుందని ఆశించినా ఆమెకు పెద్ద ప్రయార్టీ దక్కలేదు. మొన్న మేలో జరిగిన పార్టీ మహానాడులో తనకు ప్రసంగించే అవకాశమూ దక్కకపోవడంతో పార్టీకి రిజైన్ చేస్తానని ప్రకటించారు.

తరవాత ఆమెను బుజ్జగించి అధినేత చంద్రబాబుతో భేటి ఏర్పాటు చేసినా అక్కడా ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆమె ఇక అక్కడ ఉండలేను అంటూ రాజీనామా చేశారు. గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండి నిత్యం వైసీపీ మీద విమర్శలు కురింపించే దివ్యవాణి, టీడీపీ నన్ను మోసం చేసిందని టీడీపీలో ఒక వర్గం వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటూందని ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేసీ పార్టీ నుంచి బయటికి వచ్చేశారు.
ఆ తర్వాత టీడీపీ, దాని అనుకూల మీడియా దివ్యవాణి వైసీపీ కోవర్ట్ అని అరోపిస్తూ దివ్యవాణి వైసీపీలోకి వెళ్లబోతున్నట్లు ప్రచారం చేశారు. దివ్యవాణి గత కొంత కాలంగా సైలంట్‌గా ఉండి ఈ రోజు రాజకీయ సమావేశం అవ్వడంతో దివ్యవాణి బీజేపీలో చేరుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఆమె ఏపీ బీజేపీలో చేరకుండా తెలంగాణలో చేరుతుండడం పట్ల కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.