మతితప్పిన మూర్ఖపు సీఎం జగన్ రెడ్డి విద్యార్థుల్నిబలి చేయొద్దు
టెన్త్, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయాలి తుగ్లక్ నిర్ణయాలతో విద్యాసంవత్సరం గందరగోళం-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విధాత:మతితప్పిన మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పరీక్షలపై తీసుకుంటోన్న తుగ్లక్ నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది కూడా ఇలాగే రెండు సార్లు పరీక్షలు వాయిదా వేసి, చివరకు రద్దు చేశారని, […]

- టెన్త్, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయాలి
- తుగ్లక్ నిర్ణయాలతో విద్యాసంవత్సరం గందరగోళం
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
విధాత:మతితప్పిన మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పరీక్షలపై తీసుకుంటోన్న తుగ్లక్ నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది కూడా ఇలాగే రెండు సార్లు పరీక్షలు వాయిదా వేసి, చివరకు రద్దు చేశారని, ఈ ఏడాది కూడా మళ్లీ అదే తప్పు చేస్తున్నారని పేర్కొన్నారు. ముందుచూపులేని జగన్ రెడ్డి నిర్ణయాలతో విద్యాసంవత్సరం గందరగోళంలో పడనుందన్నారు.
జూలైలో పరీక్షలు పెడితే, వాల్యూయేషన్‌కి నెలన్నరకిపైగానే సమయం పడుతుందని, ఫలితాలు వచ్చేసరికి సెప్టెంబర్ నెల వచ్చేస్తుందన్నారు. రీవాల్యుయేషన్, అడ్మిషన్లు ప్రక్రియ పూర్తిచేసేసరికి అక్టోబర్ నెల గడిచిపోతుందన్నారు. ప్రతీ ఏటా జూన్ లో ప్రారంభం కావాల్సిన విద్యాసంవత్సరాన్ని అక్టోబర్ లో ప్రారంభించి నాలుగు నెలల్లో ముగించడం విద్యార్థులకు ఏం మేలు చేస్తుందో జగన్‌రెడ్డి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రకటనలు, నిర్ణయాలు చూస్తుంటే ఆయన మతి తప్పినట్లు స్పష్టమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు గల వారికి, సెప్టెంబర్ దాకా వ్యాక్సిన్లు ఇవ్వలేమని సీఎం చెప్పారన్నారు.
అంటే పిల్లలకు ఇప్పట్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని తేలిందని, అదే నెలలో పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే థర్డ్ వేవ్ పొంచి వుందని పరిశోధకులు హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కోవిడ్ భయంతో 30 మంది కూడా ఉండని క్యాబినెట్ సమావేశం నిర్వహించలేని మీరు, లక్షలాది మంది పిల్లలకు పరీక్షలు పెట్టి ప్రమాదంలోకి నెట్టేస్తారా అని సీఎంని ప్రశ్నించారు. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈతో పాటుగా, 14 రాష్ట్రాలు 10, 11 తరగతుల పరీక్షలు రద్దు చేస్తే, మొండిగా ఇంకా పరీక్షలు నిర్వహిస్తామంటూ మతి తప్పిన నిర్ణయాలెందుకు అని జగన్‌రెడ్డిని నిలదీశారు.ఇక వాయిదాలతో విద్యార్థులు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడటం ఆపి పది,ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చెయ్యాలని డిమాండ్ చేసారు.