అమరావతి : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణలో భాగంగా ఈడీ దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ మొదలైన 20 ప్రదేశాలలో ఈడీ సోదాలు కొనసాగిస్తుంది. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లోనూ ఈడీ సోదాలు చేస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రూ .3,500 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లుగా ఈడీ గుర్తించింది. నకిలీ ఇన్వాయిస్ లు, మద్యం ధరల పెంపు వెనుక భారీ స్కామ్ జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించుకుని విచారణను ఈడీ ముందుకు దూకిస్తుంది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసు విచారిస్తున్న ఏపీ సిట్ అధికారుల నుంచి పూర్తి ఈడీ ఇప్పటికే పూర్తి సమాచారం సేకరించింది. సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేయడంతో దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా సోదాలతో దర్యాప్తును ముమ్మరం చేసింది.
మరోవైపు ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఇప్పటివరకూ 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్టు చేసింది. ధనుంజయరెడ్డి (ఏ-31), కృష్ణమోహన్‌రెడ్డి (ఏ-32), బాలాజీ గోవిందప్ప (ఏ-33), పైలా దిలీప్ (ఏ-30)లు బెయిల్‌పై బయటకు రాగా.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేశ్‌నాయుడు సహా మొత్తం 8 మంది ఇంకా జైల్లోనే ఉన్నారు. కాగా లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఈనెల 26 వరకు రిమాండ్ పొడిగిస్తూ గురువారం విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది.