అమరరాజా కంపెనీలో అంతులేని కాలుష్యం..విజయ్‌కుమార్‌

పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ చర్యలు, అమరరాజా బ్యాటరీస్‌ కంపెనీపై పర్యావరణ శాఖ ఎక్స్‌ అఫిషియో సెక్రటరీ జిఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ ప్రెస్‌ మీట్‌: అమరరాజా బ్యాటరీస్‌ కంపెనీలో అంతులేని కాలుష్యంకార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రత చర్యలు లేవుహైకోర్టు ఆదేశాలు, పీసీబీ నిర్దేశాలనూ పట్టించుకోలేదుకంపెనీకి రెండు నెలల ముందే నోటీసులు ఇచ్చాంకాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరాంఅయినా కంపెనీ పట్టించుకోలేదు. మళ్లీ నోటీసు ఇచ్చాంలీగల్‌ హియరింగ్‌ అవకాశం కూడా కల్పించాంపర్యావరణ శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి వెల్లడి తిరుపతి ప్లాంట్‌ […]

అమరరాజా  కంపెనీలో అంతులేని కాలుష్యం..విజయ్‌కుమార్‌

పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ చర్యలు, అమరరాజా బ్యాటరీస్‌ కంపెనీపై పర్యావరణ శాఖ ఎక్స్‌ అఫిషియో సెక్రటరీ జిఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ ప్రెస్‌ మీట్‌:

అమరరాజా బ్యాటరీస్‌ కంపెనీలో అంతులేని కాలుష్యం
కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రత చర్యలు లేవు
హైకోర్టు ఆదేశాలు, పీసీబీ నిర్దేశాలనూ పట్టించుకోలేదు
కంపెనీకి రెండు నెలల ముందే నోటీసులు ఇచ్చాం
కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరాం
అయినా కంపెనీ పట్టించుకోలేదు. మళ్లీ నోటీసు ఇచ్చాం
లీగల్‌ హియరింగ్‌ అవకాశం కూడా కల్పించాం
పర్యావరణ శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి వెల్లడి

తిరుపతి ప్లాంట్‌ ప్రాంతంలో పర్యావరణానికి హాని
అందుకే హైకోర్టుకు పలు అంశాలు నివేదించాం
ప్లాంట్‌ తరలింపు.. జరిగిన తప్పులను కంపెనీ సరిదిద్దుకోవడం..
పరిసర గ్రామాలను రక్షించేలా చూడాలని హైకోర్టును కోరాం
అంతే తప్ప ఏ మాత్రం కక్ష సాధింపు కానే కాదు
కాలుష్య కారక పరిశ్రమలన్నింటిపైనా చర్యలు చేపడుతున్నాం
ప్రెస్‌మీట్‌లో ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌

విధాత,విజయవాడ:అమరరాజా బ్యాటరీస్‌ తరలింపు వ్యవహారంపై మీడియాలోని ఒక వర్గంలో వస్తున్న కధనాలపై పర్యావరణ శాఖ ఎక్స్‌ అఫిషియో సెక్రటరీ జిఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ స్పందించారు. కాలుష్య కారక పరిశ్రమలన్నింటిపైనా చర్యలు తీసుకుంటామన్న ఆయన, ముందుగా నోటీసులు ఇచ్చి, తగిన సమయం ఇచ్చిన తర్వాతే ఈ చర్య అయినా ఉంటుందని ఆయన వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో అమరరాజా బ్యాటరీస్‌ కంపెనీలో అంతులేని కాలుష్యంపై ఆయన వివరించారు.

పర్యావరణ శాఖ ఎక్స్‌ అఫిషియో సెక్రటరీ ప్రెస్‌మీట్‌ పాయింట్స్‌:

మూడు కేటగిరీలు:
‘పరిశ్రమలు, వాటి నుంచి వెలువడే కాలుష్యాన్ని బట్టి వాటిని మూడు కేటగిరీలు.. గ్రీన్, ఆరెంజ్, రెడ్‌గా విభజిస్తారు. రెడ్‌ కేటగిరీ పరిశ్రమలలో ఎక్కువ కాలుష్యం ఉంటుంది, అలాగే ప్రమాదకర వ్యర్థాలు ఉంటాయి. అందుకే ఆ కేటగిరీ పరిశ్రమలలో నెల నెలా ర్యాండమ్‌గా తనిఖీలు చేస్తారు’.

వాటిని ఇలా గుర్తించాం:
‘అందులో భాగంగా గత జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 54 పరిశ్రమలను (జిల్లాకు నాలుగు చొప్పున) తనిఖీలు చేశాం. అందులో కూడా గతంలో తనిఖీలు జరగని వాటిని ప్రయారిటీగా తీసుకున్నాం. ఆ తనిఖీలలో తీవ్ర కాలుష్యం వెదజల్లుతున్న పలు పరిశ్రమలను గుర్తించాం. తిరుపతి, చిత్తూరు దగ్గర ఉన్న అమరరాజా బ్యాటరీస్, కడప జిల్లాలోని కొన్ని సిమెంట్‌ పరిశ్రమలు, విశాఖ, కాకినాడ ప్రాంతాల్లో కొన్ని ఫార్మా కంపెనీలలో తీవ్ర కాలుష్యం ఉండడంతో వాటన్నింటికీ నోటీసులు ఇచ్చాం’.
‘వాటికి స్పందించిన ఆయా పరిశ్రమల యాజమాన్యాలు జరిగిన తప్పులు సరి చేసుకోవడానికి కొంత సమయం అడిగారు. అమరరాజా బ్యాటరీస్‌ యాజమాన్యం కూడా సమయం కోరడంతో, వారికి కూడా రెండు నెలల సమయం ఇచ్చాం’.

మాట నిలబెట్టుకోలేదు:
‘కానీ అమరరాజా బ్యాటరీస్‌ యాజమాన్యం మాట నిలబెట్టుకోలేదు. తమ కంపెనీలలో కాలుష్య నివారణ చర్యలు చేపట్టలేదు. రెండు నెలల తర్వాత మరోసారి తనిఖీ చేసి, మళ్లీ నోటీసులు ఇచ్చాం. వెంటనే ఉత్పత్తి నిలిపివేసి అన్నీ చక్కదిద్దాలని కోరాం. దాంతో పాటు, లీగల్‌ హియరింగ్‌ అవకాశం కూడా ఇచ్చాం’.

ప్రజల ప్రాణాలు ముఖ్యం:
‘తీవ్ర కాలుష్య కారకాలుగా ఉన్న దాదాపు 64 పరిశ్రమలలో వెంటనే ఉత్పత్తి నిలిపివేయాలని ఈ ఏడాది ఆదేశించాం. అంతే కాకుండా మరో 50 పరిశ్రమల్లో కూడా కాలుష్యం ఎక్కువ ఉందని క్లోజర్‌ ఆర్డర్‌ ఇచ్చాం. క్లోజర్‌ ఆర్డర్‌ ఇచ్చినా, స్టాప్‌ ప్రొడక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చినా వెంటనే కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి. ఆ పని చేసే వరకు ఉత్పత్తి పూర్తిగా నిలిపివేయాలి. అందుకే క్లోజర్‌ ఆర్డర్‌ ఇచ్చినప్పుడు కరెంట్‌తో సహా అన్ని నిలిపేస్తాం. ఉత్పత్తి నిలిపివేయాలన్నప్పుడు కరెంటు సరఫరా ఉంటుంది’.

అమరరాజాకు సంబంధించి ఏం జరిగింది?:
‘అమరరాజా బ్యాటరీస్‌కు సంబం«ధించి ఒక మీడియాలో వచ్చిన కథనం పూర్తిగా అబద్ధం. మాకు ఏ కోశాన ఆ ఆలోచన లేదు. ర్యాండమ్‌ తనిఖీలో ఆ కంపెనీలో కాలుష్యాన్ని గుర్తించాం. నోటీసు ఇచ్చి రెండు నెలల సమయం కూడా ఇచ్చాం. కానీ ఆ యాజమాన్యం తప్పులు సరిదిద్దుకోలేదు. దీంతో పూర్తిస్ధాయిలో దర్యాప్తు చేసి క్లోజర్‌ ఆర్డర్‌ ఇచ్చాం. దానిపై వారు హైకోర్టును ఆశ్రయించడంతో, న్యాయస్థానం నాలుగు వారాల పాటు మా ఆర్డర్‌పై స్టే ఇచ్చింది. అదే సమయంలో ఒక టీంను ఏర్పాటు చేసి సమగ్రంగా తనిఖీలు చేసి, ఆ సందర్భంగా గుర్తించిన అంశాలన్నింటినీ సమర్పించాలని సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది’.
‘హైకోర్టు ఆదేశాల ప్రకారం ఒక టెక్నికల్‌ టీంను ఏర్పాటు చేసి కంపెనీలో సమగ్రంగా తనిఖీలు చేసి, గుర్తించిన అంశాలన్నింటినీ న్యాయస్థానానికి నివేదించాం. వాటిలో ఒకటి రెండు విషయాలు మీ ముందుంచుతున్నాను’.

అమరరాజా కంపెనీలో కాలుష్యం:
‘అక్కడ వాడే నీటిని పూర్తిస్ధాయిలో ట్రీట్‌ చేయాలి. కానీ అలా చేయకుండా లెడ్‌తో కలిసి వస్తున్న నీటిని మొక్కలు పెంచడానికి, మిగిలిన అవసరాలకు వాడుతున్నారు. దాంతో మొక్కలు, మనుషులతో పాటు, అక్కడి జంతువులలో కూడా లెడ్‌ ప్రవేశించే పరిస్ధితి కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 10 అత్యంత ప్రమాదకరమైన మెటల్స్‌ను గుర్తించగా వాటిలో లెడ్‌ ఒకటి. అది కనుక మానవ శరీరంలో ఉంటే నరాలకు సంబంధించి, కార్డియో వ్యాస్కులర్, ఇమ్యూన్‌ సిస్టమ్, కిడ్నీలపై ప్రభావం చూపుతుందని డబ్యూహెచ్‌వో తెలియజేసింది’.

ప్రమాదకారిగా లెడ్‌:
‘ఇంత సీరియస్‌ అంశం కాబట్టే హైకోర్టు కూడా లోతుగా పరిశీలించి పూర్తి స్ధాయి తనిఖీలు చేసి రిపోర్ట్‌ ఇవ్వాలని ఆదేశించింది. అసలు నీటిని పారిశుద్ధ్యం (ఈటీపీ) చేయకుండా ఎస్‌టీపీలోకి వదిలేస్తున్నారు. ఆ నీటిని గ్రీన్‌బెల్ట్‌కు వాడడంతో, అక్కడ నుంచి డౌన్‌స్ట్రీమ్‌కు వెళ్ళిపోతున్నాయి. అక్కడ మల్లెమడుగు అనే రిజర్వాయర్, గొల్లపల్లి చెరువు, నాయుడు చెరువు అనేది ఈ విధంగా వేర్వేరు రిజర్వాయర్లు, చెరువులు ఉన్నాయి’.
‘ఆ నీటికి వర్షపు నీరు తోడై రిజర్వాయర్లలోకి లెడ్‌ చేరుతోంది. ఆ రిజర్వాయర్లలో నీటిని తనిఖీ చేస్తే మల్లెమడుగులో 134.79 మిల్లీగ్రామ్స్‌–కేజీ లెడ్, గొల్లపల్లిలో 319 మిల్లీగ్రామ్స్, నాయుడు చెరువులో 3159 మిల్లీగ్రామ్స్‌–కేజీ లెడ్‌ గుర్తించాం. ఆ కాలుష్యానికి కారకులు ఎవరో వారే దాన్ని సరిదిద్దాలి. తిరుపతి ప్లాంట్‌లో చూస్తే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన లెడ్‌తో కలిసిన నీరు చెరువులలో కలవడం వల్ల ఈ రకమైన రీడింగ్స్‌ వచ్చాయి’.

దారుణ పరిణామాలు:
‘ఈ వాటర్‌ తాగిన జంతువులలోకి లెడ్‌ వెళుతుంది, అక్కడ పండిన మొక్కలలోకి లెడ్‌ వెళుతుంది, ఆ మొక్కల నుంచి పండిన కూరగాయలు మనం తింటే మనుషులకు చేరుతుంది. మానవ శరీరంలో అది మాగ్నిఫై అవుతుంది. పశువులు తిన్న గడ్డి నుంచి వాటిలోకి చేరి ఆ పాలు మనుషులు తాగితే మనుషులకు చేరుతుంది. ఫుడ్‌ చైన్‌లో ఇది మానవ శరీరంలోకి లెడ్‌ చేరుకుంటుంది’.
‘అమరరాజా కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చుట్టుపక్కల పర్యావరణాన్ని కూడా వారు కాలుష్యం చేశారు, చుట్టుపక్కల 4, 5 కిలోమీటర్ల పరిధిలోని భూమిలో, నీటిలో లెడ్‌ ప్రవేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటుచేసిన టీం తనిఖీలలో ఇది బయటపడింది’.

వాయు కాలుష్యం:
‘దీంతోపాటు ఎయిర్‌ పొల్యూషన్‌ పై మేం 28 స్టాక్స్‌కు అనుమతిస్తే వారు అదనంగా అనధికారికంగా మరో 73 పెట్టారు. చిత్తూరు యూనిట్‌లో 137 అదనంగా అనధికార స్టాక్స్‌ ద్వారా లెడ్‌ను గాలిలోకి వదిలేస్తున్నారు. ఈ రకమైన పరిణామాలన్నీ టీం గుర్తించింది, మేం శాంపిల్స్‌ తీసుకునేటప్పుడు ప్రతీ చోటా రెండు రెండు శాంపిల్స్‌ తీసుకుని ఒక శాంపిల్‌ మేం అనలైజ్‌ చేసి, మరో శాంపిల్‌ ఈపీటీఆర్‌ఐకి పంపాం. వారు కూడా ఈ బోర్డుతో సంబంధం లేకుండా అనలైజ్‌ చేశారు. ఈ రెండిటినీ తీసుకుని కంపారిజన్‌ చేసి మేం హైకోర్టుకు సమర్పించడం జరిగింది’.

నీటి కాలుష్యం:
‘ఫ్యాక్టరీ మొయిన్‌ గేట్‌ వద్ద బోర్‌వెల్‌ వాటర్‌ శాంపిల్‌ ఈపీటీఆర్‌ఐకి పంపితే దానిలో 700 శాతం పరిమితికి మించిన లెడ్‌ ఉంది. అలాగే ఎస్టీపీ అవుట్‌లెట్‌లో 0.2 మైక్రోగ్రామ్స్‌–లీటర్‌ ఈపీటీఆర్‌ఐలో వసే,్త బోర్డు అనాలసిస్‌లో 0.19 వచ్చింది. అంటే 90 శాతం అనుమతించిన దాని కంటే ఎక్కువగా బోర్డు అనాలసిస్‌లో వస్తే 100 శాతం కంటే ఎక్కువ ఈపీటీఆర్‌ఐ రిపోర్ట్‌లో వచ్చింది’.
‘ఎల్‌వీఆర్‌ఎల్‌ఏ స్టోర్స్‌ శాంపిల్‌లో 200 శాతం అధికంగా ఉన్నట్లు వచ్చింది. లెడ్‌ కూడా 200 శాతం అధికంగా ఉన్నట్లు ఈపీటీఆర్‌ఐ రిపోర్ట్‌లో వచ్చింది. మల్లెమడుగు రిజర్వాయర్‌లో 0.3 మైక్రోగ్రామ్స్‌ వచ్చింది. అక్కడ 200 శాతం ఎక్కువగా ఉంది. గొల్లపల్లి చెరువులో 500 శాతం, కరకంబాడి చెరువులో 90 శాతం, నాయుడు చెరువులో 1100 శాతం అధికంగా లెడ్‌ నీటిలో ఉంది’.

ఉద్యోగుల్లోనూ లెడ్‌:
‘అమరరాజా కంపెనీ తమ ఉద్యోగుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిజానికి ప్రతి 6 నెలలకు వారి బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకుని వారికి ఎక్కడైనా పరిమితికి మించి లెడ్‌ ఎక్కువగా ఉంటే వారిని నాన్‌ లెడ్‌ ఎక్స్‌పోజర్‌ ఏరియాలకు తరలించాలి. ఆ విధంగా తరలించిన రిపోర్ట్‌ను ప్రతీ ఆరు నెలలకు కాలుష్య నియంత్రణ మండలికి పంపాలి. కానీ కంపెనీ ఏనాడూ ఆ పని చేయలేదు’.
‘మేం కొన్ని బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకుని బెంగళూరులోని ల్యాబ్‌కు పంపగా 12 శాతం శాంపిల్స్‌లో బ్లడ్‌ లెవల్స్‌ 42 మైక్రోగ్రామ్స్‌–డెసిలీటర్‌ ఉంది. కానీ 10 మైక్రోగ్రామ్స్‌కు మించకూడదు. తిరుపతి యూనిట్‌లో 5400 మంది, చిత్తూరు యూనిట్‌లో 4 వేల మంది పని చేస్తున్నారు. ఇంచుమించు 450 మందికి పరిధి దాటిపోయి ఉండడం జరిగింది. ఈ రిపోర్ట్‌ చూసిన వెంటనే హైకోర్టు తీవ్రంగా పరిగణించి వారందరినీ నాన్‌లెడ్‌ ఏరియాకు తరలించి, అది కూడా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారుల సమక్షంలో చేయాలని ఆదేశించింది. ఆ రిపోర్ట్‌ను హైకోర్టుకు ఇవ్వమని ఆదేశించింది’.

అన్నీ బేఖాతరు:
‘స్కిల్డ్‌ ఉద్యోగులను దాదాపు 20 ఏళ్ళుగా అక్కడే పని చేయించడం వల్ల వారు లెడ్‌కు ఎక్స్‌పోజ్‌ అవుతున్నట్లు గుర్తించాం. అక్కడ లెడ్‌ను ఏ విధంగా ట్రీట్‌మెంట్‌ జరగకుండా వదిలేస్తున్నారు. ఇది చాలా ఏళ్ళుగా జరుగుతుంది. దీనిపై పూర్తిస్ధాయి అధ్యయనం చేయడానికి ఐఐటీ మద్రాస్‌ వారికి అప్పగించాం. అయితే మరోసారి చేయడానికి వీల్లేదని అడ్డుకున్నారు. మేం అక్కడి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాం, వాటర్‌ యాక్ట్, ఎయిర్‌ యాక్ట్‌ ప్రకారం అధికారులు తనిఖీలు చేయడానికి వస్తే ఏ పరిశ్రమనైనా ఎప్పుడైనా తనిఖీ చేసే అధికారం చట్టం కల్పించింది. అలా చట్టం కల్పించే అధికారాన్ని అడ్డుకుంటే కేసు ఫైల్‌ చేయడం జరిగింది. దీనిని హైకోర్టు సీరియస్‌గా తీసుకుని అధికారులు ఎక్కడైనా ఎప్పుడైనా తనిఖీలు చేయవచ్చని అధికారం ఉందని ఆదేశించింది’.

కోర్టుకెక్కారు:
‘సహజ న్యాయసూత్రాల ప్రకారం మేం అన్నీ చేసిన తర్వాత కూడా వారిని అన్యాయంగా ఇబ్బంది పెట్టామంటూ హైకోర్టుకు వెళ్ళారు. నిజానికి హైకోర్టు తమకు ఇచ్చిన టైమ్‌లో కూడా వారు తప్పులు సరిచేసుకోలేదు’.

కోర్టులో వాటిని అభ్యర్థించాం:
‘తిరుపతి ప్లాంట్‌ ఉన్న ప్రాంతంలో పర్యావరణానికి చాలా ప్రమాదం జరిగింది, అది సరి చేయలేనిది కాబట్టి ప్లాంట్‌ను అక్కడి నుంచి తరలించాలని, జరిగిన తప్పులు సరిదిద్దాలని, చుట్టుపక్కల గ్రామలను రక్షించాలని మేం హైకోర్టును కోరాం’.
‘అంతేకానీ మేం టార్గెట్‌ చేసుకుని చేశాం అన్నది కాదు. పరిశ్రమ ఇక్కడ ఉండటానికి వీల్లేదని ఇంకొక చోటకు మార్చాల్సిన పరిస్ధితి అని మేం హైకోర్టుకు చెప్పాం. చిత్తూరు ఫ్యాక్టరీ వల్ల రకరకాల కారణాలతో ఇమ్యూన్‌ సిస్టం దెబ్బ తింటుందని చెప్పాం’.

అవి అసత్య కథనాలు:
‘ఇవీ వాస్తవాలు. అందుకే అమరరాజా బ్యాటరీస్‌కు సంబంధించి మేం ఏ రకమైన టార్గెట్‌తోనూ చర్యలు చేపట్టలేదు. అయినా అసత్య కథనాలు రాసిన పత్రికకు మా శాఖ తరపున లీగల్‌ నోటీసు పంపిస్తాము. పరువు నష్టం దావా కూడా వేస్తాం’.. అని పర్యావరణ శాఖ ఎక్స్‌ అఫిషియో సెక్రటరీ జిఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ వివరించారు.