విధాత:కృష్ణాజిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ముగ్గురు పాస్టర్లు ట్రస్ట్ ముసుగులో హైడ్రామా చేశారు.గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులను వారికి తెలియకుండానే డైరెక్టరల్లు గా పెట్టి అనాధల కోసం ట్రస్ట్ స్థాపించారు.గ్రామంలోని ఇరవై ఐదు కుటుంబాలకు చెందిన పిల్లలకు యాపిల్ కాయ ఇస్తూ ఫోటోలు తీసి 4 కోట్లు ఫండ్ కావాలని ఫేస్బుక్ లో పెట్టిన వైనం.ఫేస్బుక్ లో వారి యొక్క పిల్లలు మతిస్థిమితం లేని పిల్లల గా తల్లిదండ్రులు లేని అనాధలు గా పెట్టడాన్ని గుర్తించిన గ్రామస్తులు.పిల్లల తల్లిదండ్రులు బొడ్డు శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి నిలదీశారు దీన్ని గమనించిన మరో ఇద్దరు పాస్టర్లు పరార్ అయ్యారు.స్థానికంగా ఉన్న బొడ్డు శ్రీనివాసరావుకు దేహశుద్ధి చేసిన అనంతరం రూరల్ పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు.