హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం

విధాత‌: భీమవరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో డాక్టర్ రూమ్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరాను నిలిపి వేశారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పీ వేయడంతో ప్రమాదం తప్పింది. అయితే డాక్టర్ రూమ్‌తో పాటు ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో డాక్టర్ రూమ్‌లో ఎవరూ లేకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

  • Publish Date - August 23, 2021 / 03:22 AM IST