కృష్ణానదికి పెరగనున్న వరద ఉధృతి

విధాత‌: ఆదివారం మధ్యాహ్నం నుంచి నాగార్జునసాగర్ నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశo ఉంది.ప్రస్తుతం కృష్ణ బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 33,002 క్యూసెక్కులు ఉండగా,ఔట్ ఫ్లో 24,750 క్యూసెక్కులు ఉంది.వరద ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తంచేసిన జిల్లాకలెక్టర్ జె. నివాస్.కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మత్య్సకారుల పడవలు,ఇళ్లల్లో పెంచుకునే పాడిపశువులు,మేకలు వంటివి సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించాల‌న్నారు.బోట్లు,మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దు .వరద […]

  • Publish Date - July 31, 2021 / 11:09 AM IST

విధాత‌: ఆదివారం మధ్యాహ్నం నుంచి నాగార్జునసాగర్ నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశo ఉంది.ప్రస్తుతం కృష్ణ బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 33,002 క్యూసెక్కులు ఉండగా,ఔట్ ఫ్లో 24,750 క్యూసెక్కులు ఉంది.వరద ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తంచేసిన జిల్లాకలెక్టర్ జె. నివాస్.కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మత్య్సకారుల పడవలు,ఇళ్లల్లో పెంచుకునే పాడిపశువులు,మేకలు వంటివి సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించాల‌న్నారు.బోట్లు,మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దు .వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.