నకిలీ వజ్రం ఇచ్చి లక్షలు కొట్టేశారు
విధాత: దురాశ దుఃఖానికి చేటు అని ఊరికే అనలేదు. కోట్ల విలువైన వజ్రం అంటూ కేటుగాళ్లు ఇచ్చిన ఆఫర్ చూసి 58 లక్షలు పోగోట్టుకున్నాడో ప్రబుద్ధుడు.ఈ ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరుకు చెందిన శ్రీనివాసులు, బంగారుపాళెంకు చెందిన దామోదరం, తవణంపల్లెకు చెందిన బొజ్జయ్య నాలుగు నెలల క్రితం నకిలీ వజ్రం తీసుకొచ్చి కాణిపాకంలోని భాస్కర్ నాయుడుకు రూ.58.6 లక్షలకు అమ్మారు. భాస్కర్ నాయుడు దీన్ని […]

విధాత: దురాశ దుఃఖానికి చేటు అని ఊరికే అనలేదు. కోట్ల విలువైన వజ్రం అంటూ కేటుగాళ్లు ఇచ్చిన ఆఫర్ చూసి 58 లక్షలు పోగోట్టుకున్నాడో ప్రబుద్ధుడు.
ఈ ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరుకు చెందిన శ్రీనివాసులు, బంగారుపాళెంకు చెందిన దామోదరం, తవణంపల్లెకు చెందిన బొజ్జయ్య నాలుగు నెలల క్రితం నకిలీ వజ్రం తీసుకొచ్చి కాణిపాకంలోని భాస్కర్ నాయుడుకు రూ.58.6 లక్షలకు అమ్మారు. భాస్కర్ నాయుడు దీన్ని అమ్మేందుకు నెల క్రితం ఓ వజ్రాల వ్యాపారి వద్దకు వెళ్లాడు. అక్కడ వజ్రం నకిలీదని తెలియడంతో అవాక్కయ్యాడు. వజ్రం తిరిగి ఇచ్చేస్తాను, డబ్బులు ఇవ్వండని ముగ్గురిని బతిమలాడినా కుదరని చెప్పడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.