సింహాచలం గిరి ప్రదక్షణ రద్దు
విధాత:సింహాచలం అప్పన్న ఆలయంలో ఈ ఏడాది కూడా గిరి ప్రదక్షిణను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో సూర్యకళ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూని ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాత్రి కర్ఫ్యూ పొడిగింపు, కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తెలిపారు. సింహగిరిపై కూడా ప్రదక్షిణకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి […]

విధాత:సింహాచలం అప్పన్న ఆలయంలో ఈ ఏడాది కూడా గిరి ప్రదక్షిణను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో సూర్యకళ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూని ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాత్రి కర్ఫ్యూ పొడిగింపు, కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తెలిపారు. సింహగిరిపై కూడా ప్రదక్షిణకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయన్నారు.
ఈ నెల 23, 24వ తేదీల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ యథావిధిగా స్వామివారి దర్శనాలు కొనసాగుతాయని చెప్పారు. 23న స్వామివారి మాస జయంతి, 24న తుది విడత చందన సమర్పణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.