ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. పీఆర్సీ ప్రక్రియ ప్రారంభం

విధాత: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది జగన్ సర్కార్. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పీఆర్సీ నివేదిక వచ్చేవారం విడుదల కానుంది.ఉద్యోగులు 55శాతం పీఆర్సీ ఆశిస్తుండగా ప్రభుత్వం మాత్రం 27శాతం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. పీఆర్సీ నివేదిక వస్తే దాన్నిబట్టి ఉద్యోగులు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. తమ ఆందోళనను అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రాష్ట్రంలో పీఆర్సీ ప్రక్రియ ప్రారంభమైంది: ఏపీ […]

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. పీఆర్సీ ప్రక్రియ ప్రారంభం
విధాత: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది జగన్ సర్కార్. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పీఆర్సీ నివేదిక వచ్చేవారం విడుదల కానుంది.ఉద్యోగులు 55శాతం పీఆర్సీ ఆశిస్తుండగా ప్రభుత్వం మాత్రం 27శాతం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. పీఆర్సీ నివేదిక వస్తే దాన్నిబట్టి ఉద్యోగులు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. తమ ఆందోళనను అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

   రాష్ట్రంలో పీఆర్సీ ప్రక్రియ ప్రారంభమైంది: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్రంలో పీఆర్సీ ప్రక్రియ ప్రారంభమైందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. పీఆర్సీపై త్వరలో ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు. సీఎం జగన్‌తో సీఎస్‌ చర్చిస్తున్నారని, త్వరలో సామరస్య ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. పీఆర్సీపై గత నెలాఖరునే ప్రకటన చేయాలనుకున్నట్లు చెప్పారు. 

మరోవైపు పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసేంత వరకు కదలబోమని సచివాలయం ప్రాంగణంలో ఉద్యోగ సంఘాల నేతలు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి కోసం సీఎస్‌ సమీర్‌ శర్మ సీఎం క్యాంపు కార్యా లయానికి వెళ్లారు.