భారీ వర్షాలు: కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష.. బాధితులకు తక్షణ సాయం

విధాత: ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్‌ కడప జిల్లాల కలెక్టర్లు, అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలపై వాతావరణశాఖ అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. కాగా ఈ సాయంత్రం చెన్నై వద్ద వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం చెన్నై ప్రాంతంలో 60–70 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయని, ఎస్‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైయస్సార్‌ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని […]

భారీ వర్షాలు: కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష.. బాధితులకు తక్షణ సాయం

విధాత: ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్‌ కడప జిల్లాల కలెక్టర్లు, అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలపై వాతావరణశాఖ అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. కాగా ఈ సాయంత్రం చెన్నై వద్ద వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం చెన్నై ప్రాంతంలో 60–70 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయని, ఎస్‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైయస్సార్‌ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం తుపానుగా మారి దక్షిణ కోస్తాంధ్రాలో ఈనెల 17న ఇది తీరం దాటే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీనివల్ల దక్షిణ కోస్తాంధ్రలో మరో విడుత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.

వర్ష బాధితులకు తక్షణ సాయం

భారీ వర్షాల నేపథ్యంలో బాధితులకు తక్షణ సాయంగా ఆహారంతో పాటు రూ.వెయ్యి చొప్పున అందించాలని సీఎం జగన్‌ అధఙకారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల వారిని ప్రత్యేక శిబిరాలకు తరలించాలని తెలిపారు. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితుల కోసం ఫోన్‌ నంబర్‌ను అందుబాటులో ఉంచాలన్నారు.