విధాత: రాష్ట్ర వ్యాప్తంగా నఖీలీ చలనాల కుంభకోణం కేసులో భారీగా రికవరీ చేస్తున్న స్టాప్స్ & రెవెన్యూశాఖ అధికారులు.ఇప్పటి వరకు సుమారు మూడు కోట్ల రూపాయల రికవరీ చేసినట్లు సమాచారం.అందులో కేవలం విజయవాడలో అది పడమట సబ్ రిజిస్టార్ కార్యలయం నుంచే సుమారు 1.22 లక్షల రూపాయల నగదును రికవరీ చేసిన సదరు శాఖ అధికారులు.
రాబోయే రోజుల్లో మరింత నగదు రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు స్టాప్స్&రెవెన్యూశాఖ అధికారులు,ఈ కుంభకోణం లో అధికంగా లాభపడింది దస్తావేజు లేఖరులే అంటున్న అధికారులు వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని సమాచారం.ఇకపై అయినా దస్తావేజు లేఖరుల పై ఒకింత నిఘా ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తమవుతోంది.