దేవినేని ఉమ బెయిల్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ
విధాత:దేవినేని ఉమ బెయిల్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ చేయగా ఉత్తర్వుల కోసం రేపటికి వాయిదా వేసింది.ఈ కేసులో ఎటువంటి గాయాలు లేవని, హత్యాయత్నం సెక్షన్లు వర్తించవని పేర్కొన్న ఉమ తరపు న్యాయవాదులు. డ్రైవర్ కులం పిటీషనర్ కు తెలియదన్న న్యాయవాది, రాజకీయ కక్షతోనే దేవినేనిఉమాను కేసులో ఇరికించారని పేర్కొన్నారు. కేసు విచారణ జరుగుతుందని, మిగతా నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని, ఈ దశలో బెయిల్ ఇవ్వడం మంచిది కాదని పేర్కొన్న ప్రభుత్వ న్యాయవాది,పోలీసులు కస్టడీ పిటీషన్ […]

విధాత:దేవినేని ఉమ బెయిల్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ చేయగా ఉత్తర్వుల కోసం రేపటికి వాయిదా వేసింది.ఈ కేసులో ఎటువంటి గాయాలు లేవని, హత్యాయత్నం సెక్షన్లు వర్తించవని పేర్కొన్న ఉమ తరపు న్యాయవాదులు. డ్రైవర్ కులం పిటీషనర్ కు తెలియదన్న న్యాయవాది, రాజకీయ కక్షతోనే దేవినేనిఉమాను కేసులో ఇరికించారని పేర్కొన్నారు.
కేసు విచారణ జరుగుతుందని, మిగతా నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని, ఈ దశలో బెయిల్ ఇవ్వడం మంచిది కాదని పేర్కొన్న ప్రభుత్వ న్యాయవాది,పోలీసులు కస్టడీ పిటీషన్ మచిలీపట్నం కోర్టులో వేశారని తెలిపారు. ఇరు పక్షాల విన్న అనంతరం ఉత్తర్వుల కోసం రేపటికి వాయిదా వేసిన హైకోర్టు