విధాత: నరేగా పనులకు బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.రెండు వారాల్లో బిల్లులు చెల్లించి హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.బిల్లులు చెల్లించకపోవడం పిటిషనర్ల జీవించే హక్కును హరించడమేనన్న న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు అంటే గౌరవంతో జీవించడం.చేసిన పనులకు బిల్లులను చెల్లించమని హైకోర్టు ఇప్పటికే చెప్పినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు.అప్పుకు వడ్డీలు కట్టలేక, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక కాంట్రాక్టర్లు ఇబ్బందిపడుతున్నారు.కేంద్రం నరేగా పనులకు నిధులు చెల్లించామని, తమ వద్ద బకాయిలు లేవని అఫిడవిట్‌లో చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వం డబ్బు రాలేదని చెబుతోంది.. ఈ రెండు పరస్పర విరుద్ధమయిన అంశాలు. గతంలో బిల్లులు చెల్లిస్తామని ఏజీ హామీ ఇచ్చినప్పటికీ చెల్లింపులు జరగకపోవటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం.ప్రభుత్వ వైఖరిలో ఎప్పటికప్పుడు కేసు వాయిదా వేయించుకునేందుకే తాపత్రయం కనిపిస్తోంది.
బిల్లులు చెల్లించడం అంటే పంచాయతీ ఎకౌంట్లలో డబ్బులు వేయడం కాదు.. పిటిషనర్ల ఎకౌంట్లలో చెల్లించాలి.అది చెల్లించకుండా జాప్యం చేయడం క్షమించరాని అంశం.చెల్లించిన వివరాలు ఎందుకు దాఖలు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం.రెండు వారాల్లోపు 500 మంది పిటిషనర్లకు డబ్బు చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు.చెల్లించాల్సిన డబ్బుకు వడ్డీ, 20 శాతం మినహాయింపును ప్రధాన పిటిషన్ విచారణలో పరిశీలిస్తామని చెప్పిన హైకోర్టు.