సలహాదారులపై జగన్ కు హైకోర్టు షాక్

విధాత:ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం జగన్ కు పలు అంశాల్లో సలహాలు సూచనలు ఇచ్చేందుకు దాదాపు 50 మంది సలహాదారుల్ని నియమించారు. వీరంతా సమయానుగుణంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తారని వారి నియామకం సందర్భఁగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పీరికి ఒక్కొక్కరికీ రూ.2 లక్షల వేతనం కూడా ఇస్తోంది. అయితే సీఎం జగన్ కు సలహాదారులుగా నియమితులైన వీరిలో కొందరు నిత్యం రాజకీయ వ్యాఖ్యలు చేయడం, అధికారులతో సమీక్షల్లో పాల్గొంటుండటం చేస్తున్నారు. దీంతో హైకోర్టు ఈ […]

సలహాదారులపై జగన్ కు హైకోర్టు షాక్

విధాత:ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం జగన్ కు పలు అంశాల్లో సలహాలు సూచనలు ఇచ్చేందుకు దాదాపు 50 మంది సలహాదారుల్ని నియమించారు. వీరంతా సమయానుగుణంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తారని వారి నియామకం సందర్భఁగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పీరికి ఒక్కొక్కరికీ రూ.2 లక్షల వేతనం కూడా ఇస్తోంది. అయితే సీఎం జగన్ కు సలహాదారులుగా నియమితులైన వీరిలో కొందరు నిత్యం రాజకీయ వ్యాఖ్యలు చేయడం, అధికారులతో సమీక్షల్లో పాల్గొంటుండటం చేస్తున్నారు. దీంతో హైకోర్టు ఈ వ్యవహారంలో సీరియస్ అయింది.

సలహాదారులపై జగన్ కు హైకోర్టు షాక్
వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ కు సలహాదారులుగా నియమించిన వారిలో కొందరు తమ అధికార పరిధిని మీరి వ్యవహరిస్తున్నారనే అంశం తాజాగా హైకోర్టు దృష్టికి వచ్చింది.మాజీ సీఎస్, మాజీ జగన్ సలహాదారు, ప్రస్తుత ఎస్ఈసీ నీలం సాహ్నీ నియామకంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా జగన్ సలహాదారుల అంశం తెరపైకి వచ్చింది. సలహాదారుల్లో కొందరుప తమకు అప్పగించిన విధులకు పరిమితం కాకుండా, రాజకీయ వ్యవహారాల్లో పాలుపంచుకుంటున్నారని, అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారనే అంశంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

సలహాదారులపై హైకోర్టు సూటి ప్రశ్నలు

ప్రభుత్వ సలహాదారుల నియామక విధానం, వారికి అప్పగించిన విధుల స్వభావం ఏంటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వారి విధుల నిబంధనలు, విధివిధానాలేంటో అదనపు అఫిడవిట్ రూపంలో తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇఛ్చింది. సలహాదారుల విషయంలో వస్తున్న విమర్శలపై హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఎస్ఈసీ నీలం సాహ్నీ నియామకం విషయంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డిని ఉద్దేశించి గతంలో మీరు ఏజీగా పనిచేసినప్పుడు ఇలాంటి పరిస్ధితి ఉందా అని ప్రశ్నించింది. దీనికి ఆయన లేదని సమాధానం ఇఛ్చారు..

సజ్జల పొలిటికల్ కామెంట్స్ పై హైకోర్టు ఆక్షేపణ

సీఎం జగన్ కు ప్రజాభద్రతా సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ వ్యాఖ్యలపై హైకోర్టు పరోక్షంగా ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. కొందరు సలహాదారులు రాజకీయ అంశాలు మీడియాతో మాట్లాడటాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఇది చట్ట విరుద్ధం కాదా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గతంలో ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కూడా గవర్నర్ కు అప్పట్లో ఇచ్చిన ఫిర్యాదులోనూ సజ్జల పొలిటికల్ కామెంట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సజ్జల తీరుపై నిత్యం విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టు కూడా ఆయన పేరు చెప్పకుండానే సలహాదారుల పొలిటికల్ కామెంట్స్ ను తప్పుబట్టింది.

మంత్రులుండగా సలహాదారుల సమీక్షలా ?

రాష్ట్రంలో సీఎం సలహాదారులు అధికారులతో సమీక్షలు నిర్వహించడంపైనా హైకోర్టు అభ్యంతరం తెలిపింది. మంత్రులు ఉండగా కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో సలహాదారులు సమీక్షలు నిర్వహించవచ్చా అని హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. అసలు సలహాదారులకు అప్పగించి విధుల్ని తాము పరిశీలించాలని భావిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం తెలిపింది. దీనిపై అవసరమైన వివరాలు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 19కు తదుపరి విచారణను వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటికల్లా వివరాలు తమ ముందుంచాలని ఆదేశించింది.