విచారణ పూర్తయ్యే వరకు ఉన్నతాధికారులు కోర్టుకు హాజరు కావాల్సిందే

విధాత‌: జాతీయ ఉపాధిహామీ పథకం పెండింగ్‌ బిల్లులపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పెండింగ్‌ బిల్లులకు సంబంధించి ఇప్పటికే రూ.400 కోట్లు చెల్లించామని, మరో రూ.1100 కోట్లు వారం రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కోర్టు విచారణకు హాజరైన ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, ఎస్.ఎస్‌ రావత్‌ పంచాయతీల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్టు తెలిపారు. అధికారుల వివరణపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వీరారెడ్డి, దమ్మాలపాటి, నర్రా శ్రీనివాస్‌ అభ్యంతరం తెలిపారు. నగదు నేరుగా గుత్తేదారులకు […]

  • Publish Date - August 25, 2021 / 04:49 AM IST

విధాత‌: జాతీయ ఉపాధిహామీ పథకం పెండింగ్‌ బిల్లులపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పెండింగ్‌ బిల్లులకు సంబంధించి ఇప్పటికే రూ.400 కోట్లు చెల్లించామని, మరో రూ.1100 కోట్లు వారం రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కోర్టు విచారణకు హాజరైన ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, ఎస్.ఎస్‌ రావత్‌ పంచాయతీల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్టు తెలిపారు. అధికారుల వివరణపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వీరారెడ్డి, దమ్మాలపాటి, నర్రా శ్రీనివాస్‌ అభ్యంతరం తెలిపారు. నగదు నేరుగా గుత్తేదారులకు ఇవ్వకుండా వేధిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం గుత్తేదారులకు సొమ్ము చెల్లించి ఆ వివరాలు హైకోర్టుకు నివేదించాలని ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు ఉన్నతాధికారులు కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. కేంద్రం నుంచి ఇంకా డబ్బు రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలపగా తాము మొత్తం చెల్లించామని కేంద్రం తరఫు న్యాయవాది బదులిచ్చారు. ఏ ఏ పనులు చేశారు. ఎవరెవరు ఎంతెంత చెల్లించారన్న అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్‌ దాఖలు చేయాలంటూ కేసు విచారణను వచ్చే నెల 22కు హైకోర్టు వాయిదా వేసింది.