విధాత: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం విద్యారంగంలో అనేకమైన విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుందన్నారు హోం మంత్రి సుచరిత.నాడు నేడు కార్యక్రమంతో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల నిర్మించారు,విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్లో అమ్మ వడి ద్వారా ప్రభుత్వం ఏటా 15 వేల రూపాయలు జమ చేస్తుంది అమ్మవడి డబ్బులు ద్వారా విద్యార్థి చదువుకి కావాల్సిన అదనపు అవసరాలను తల్లిదండ్రులు తీర్చాలి.గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు,ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు పోషకమైన భోజనం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.