విజయవాడ నుంచి కర్నూలుకు మారిన రాష్ట్ర హెచ్‌ఆర్సీ ప్రధాన కార్యాలయం

విధాత‌: రాష్ట్ర హెచ్‌ఆర్సీ ప్రధాన కార్యాలయంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఆర్సీ ప్రధాన కార్యాలయం విజయవాడ నుంచి కర్నూలుకు మారుస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2017లో విజయవాడలో హెచ్‌ఆర్సీ కార్యాలయం ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. అలాగే ఏపీ లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రధాన కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయనుంది. కాగా, ఇప్పటివరకు లోకాయుక్త, ఉప లోకాయుక్త కార్యాలయాలు హైదరాబాద్‌ నుంచి పనిచేశాయి. ప్రస్తుతం హెచ్‌ఆర్సీ, లోకాయుక్తల తరలింపు […]

  • Publish Date - August 27, 2021 / 03:56 AM IST

విధాత‌: రాష్ట్ర హెచ్‌ఆర్సీ ప్రధాన కార్యాలయంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఆర్సీ ప్రధాన కార్యాలయం విజయవాడ నుంచి కర్నూలుకు మారుస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2017లో విజయవాడలో హెచ్‌ఆర్సీ కార్యాలయం ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. అలాగే ఏపీ లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రధాన కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయనుంది. కాగా, ఇప్పటివరకు లోకాయుక్త, ఉప లోకాయుక్త కార్యాలయాలు హైదరాబాద్‌ నుంచి పనిచేశాయి. ప్రస్తుతం హెచ్‌ఆర్సీ, లోకాయుక్తల తరలింపు హైకోర్టు విచారణలో ఉన్నాయి.