మోదీకి చిత్తశుద్ది ఉంటే..అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి: శైలజానాధ్

విధాత,అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చిత్తశుద్ది ఉంటే కరోనా నివారణకు దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ఎపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మసూచి, ప్లేగు, పోలియో వంటి మహమ్మారి వ్యాధులను తరిమి కొట్టామన్నారు. ప్రధాని గత అనుభవాలు తెలుసుకుని యూనివర్స్ ఇమనైజేషన్ కింద అందరికీ వ్యాక్సిన్ వేయించాలని డిమాండ్ చేశారు.సామాన్య ప్రజల జీవితాలు, ప్రాణాలపై కొంతైనా ప్రేమ చూపించాలని మోదీని కోరుతున్నట్లు శైలజానాధ్ అన్నారు. […]

మోదీకి చిత్తశుద్ది ఉంటే..అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి: శైలజానాధ్

విధాత,అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చిత్తశుద్ది ఉంటే కరోనా నివారణకు దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ఎపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మసూచి, ప్లేగు, పోలియో వంటి మహమ్మారి వ్యాధులను తరిమి కొట్టామన్నారు. ప్రధాని గత అనుభవాలు తెలుసుకుని యూనివర్స్ ఇమనైజేషన్ కింద అందరికీ వ్యాక్సిన్ వేయించాలని డిమాండ్ చేశారు.
సామాన్య ప్రజల జీవితాలు, ప్రాణాలపై కొంతైనా ప్రేమ చూపించాలని మోదీని కోరుతున్నట్లు శైలజానాధ్ అన్నారు. జీవితమంటే వ్యాపారం కాదని, ప్రాణాలను వ్యాపారులతో ముడి పెట్టకూడదన్నారు. నాగరిక సమాజంలో ఇటువంటి పరిణామాలు మంచిది కాదన్నారు. యావత్ భారతీయులకు ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని డిమాండ్ చేస్తున్నామని శైలజానాధ్ అన్నారు.