విధాత:నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం – వన మహోత్సవం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది.మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో మొక్కనాటి సీఎం వైఎస్ జగన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గత రెండు సంవత్సరాలలో 33.23 కోట్ల మొక్కలు నాటామని.. ఈ సారి కూడా అదే ఉత్సాహంతో విరివిగా మొక్కలు నాటుదామని ప్రభుత్వం పిలుపునిచ్చింది.