ఉన్నత చదువులు లేకుంటే పేదరికం ఎన్నటికీ పోదు

విధాత‌: అందరూ బాగా చదువుకోవాలన్నదే వైకాపా ప్రభుత్వ ఉద్దేశామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఉన్నత చదువులు లేకుంటే పేదరికం ఎన్నటికీ పోదన్నారు. ప్రభుత్వం తరఫున విద్యార్థులకు ఇవ్వగలిగిన ఆస్తి చదువు ఒక్కటేనని చెప్పారు. ‘జగగన్న విద్యా దీవెన’ కింద రెండో విడత సాయం నిధులను సీఎం జగన్‌ ఇవాళ విడుదల చేశారు. 10.97 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ₹693.81 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడారు. విద్యార్థుల తల్లితండ్రులను ఆర్థికంగా […]

  • Publish Date - July 29, 2021 / 08:21 AM IST

విధాత‌: అందరూ బాగా చదువుకోవాలన్నదే వైకాపా ప్రభుత్వ ఉద్దేశామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఉన్నత చదువులు లేకుంటే పేదరికం ఎన్నటికీ పోదన్నారు. ప్రభుత్వం తరఫున విద్యార్థులకు ఇవ్వగలిగిన ఆస్తి చదువు ఒక్కటేనని చెప్పారు. ‘జగగన్న విద్యా దీవెన’ కింద రెండో విడత సాయం నిధులను సీఎం జగన్‌ ఇవాళ విడుదల చేశారు. 10.97 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ₹693.81 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడారు. విద్యార్థుల తల్లితండ్రులను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యమని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు