రోడ్డు ప్రమాదంలో పోలీసుల దుర్మరణం బాధాకరం

విధాత‌: శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులు దుర్మరణం చెందడం అత్యంత బాధాకరమ‌న్నారు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్. ఆర్మీ జవాను మృతదేహం అప్పగించి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసి ఆవేదనకు లోనయ్యాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి […]

  • Publish Date - August 24, 2021 / 03:16 AM IST

విధాత‌: శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులు దుర్మరణం చెందడం అత్యంత బాధాకరమ‌న్నారు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్. ఆర్మీ జవాను మృతదేహం అప్పగించి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసి ఆవేదనకు లోనయ్యాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.