విధాత:ఆగస్టు 15 నుంచి సచివాలయాల లో పనిచేస్తున్న మహిళ పోలీసులకు యూనిఫామ్ తప్పనిసరి.గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమితులైన ఉద్యోగులను.. ఇటీవల పోలీసుశాఖలో చేర్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మహిళా పోలీసులు ఆగస్టు 15 నుంచి పోలీసు యూనిఫాం తప్పనిసరి చేస్తూ, వీరికి యూనిఫాం భత్యాన్ని మంజూరు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు.