మోతమోగిద్దాం.. TDP కొత్త స్లోగన్

మోతమోగిద్దాం.. TDP కొత్త స్లోగన్

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా కొత్త కార్యక్రమం

చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ప్రజలమనస్సుల్లో సజీవంగా ఉంచుతూ సాధ్యమైనంత ఎక్కువ సానుభూతిని, ప్రజామద్దతును కూడగట్టేందుకు టిడిపి కొత్త కార్యక్రమం ప్లాన్ చేసింది. చంద్రబాబు అరెస్ట్ తరువాత గ్రామాలూ.. పట్టణాల్లో ధర్నాలు.. సమావేశాలు నిర్వహించి ఆయన్ను అక్రమంగా కేసుల్లో పెట్టి అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ వస్తున్న టీడీపీ ఇప్పుడు మోత మొగిద్దాం అంటూ కొత్త కార్యక్రమం చేపట్టింది.


శనివారం సాయంత్రం ఏడు గంటల నుంచి ఐదు నిముషాలపాటు హారన్లు, విజిల్లు. డప్పులు.. పళ్లెం.. ఇలా ఏదోటి మోత మోగించి ప్రజల నిరసనను, ప్రజల మద్దతును ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తెలియజేయాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. ఇప్పటికే టిడిపి నాయకులూ పట్టణాల్లో గ్రామాల్లో చంద్రబాబుకు మద్దతుగా కార్యక్రమాలు .. సభలు. సమావేశాలు నిర్వహిస్తున్నారు.



ఇప్పుడు ఇది ఇంకో కొత్తకార్యక్రమం రేపు ఒక్కరోజు చేపడుతున్నారు. అంటే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసారని, అయన అవినీతికి పాల్పడలేదని, రాజకీయ కక్షతో కేసులుపెట్టి ఒక దార్శనికుడిని, సమర్ధుడైన నాయకుడిని జైల్లో పెట్టారని ప్రజలలోకి తీసుకువెళ్లే ఉద్దేశ్యమే ఈ కార్యక్రమం లక్ష్యం.