క‌ట్టుకున్న‌ భార్య, క‌న్న‌ కొడుకుపై గొడ్డలితో దాడి…!

విధాత‌,అమరావతి : కృష్ణా జిల్లాలో దారుణం చేసాడో వ్య‌క్తి. తిరువూరు మండలం టేకుపల్లిలో సత్యనారాయణ అనే వ్యక్తి త‌న భార్య, కొడుకుపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన పద్మావతి (55) అక్కడికక్కడే మృతి చెందింది. కొడుకు చిన్నబాబు పరిస్థితి విషమంగా ఉండ‌గా అత‌నిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలతోనే సత్యనారాయణ ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు […]

క‌ట్టుకున్న‌ భార్య, క‌న్న‌ కొడుకుపై గొడ్డలితో దాడి…!

విధాత‌,అమరావతి : కృష్ణా జిల్లాలో దారుణం చేసాడో వ్య‌క్తి. తిరువూరు మండలం టేకుపల్లిలో సత్యనారాయణ అనే వ్యక్తి త‌న భార్య, కొడుకుపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన పద్మావతి (55) అక్కడికక్కడే మృతి చెందింది. కొడుకు చిన్నబాబు పరిస్థితి విషమంగా ఉండ‌గా అత‌నిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలతోనే సత్యనారాయణ ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.