శివశంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ సాయం
విధాత : ఆపద అంటూ వస్తే నేనున్నానంటూ అభయమిచ్చే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటాడు. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు.. దురదృష్టవశాత్తు ఆయన భార్యకి కూడా కరోనా సోకడంతో ఆమె ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ లో ఉండగా, పెద్ద కుమారుడు కూడా కరోనాతో వెంటిలేటర్ పై […]

విధాత : ఆపద అంటూ వస్తే నేనున్నానంటూ అభయమిచ్చే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటాడు. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు..
దురదృష్టవశాత్తు ఆయన భార్యకి కూడా కరోనా సోకడంతో ఆమె ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ లో ఉండగా, పెద్ద కుమారుడు కూడా కరోనాతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు.దీంతో కుటుం బానికి చికిత్స కోసం రోజుకు లక్ష ఖర్చు అవుతుండడంతో శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ సాయం అందించాలని గా సినీ పెద్దలను కోరారు.
విషయం తెలిసిన వెంటనే చిరంజీవి హుటాహుటిన అజయ్ ని పిలిపించుకుని తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కుని అందజేసి వైద్యానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కు మేమంతా ఉన్నాం అని అభయమిచ్చారు.