నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మంత్రి అనిల్ పర్యటన
అధికారులు, వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి అనిల్ విధాత : కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా ముందుకెళ్తున్నాం. ప్రభుత్వాసుపత్రిలో మరో ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. బ్లాక్ ఫంగస్ కేసుల కోసం ప్రత్యేకంగా 50 బెడ్లు ఏర్పాటు చేస్తున్నాం.పిల్లలకు కరోనా వస్తుందనే ప్రచారంతో కొంత అప్రమత్తమయ్యాం.ట్రీట్ మెంట్ కి అవసరమైన అన్ని సౌకార్యలు ముందుగానే చేస్తున్నాం.రెండు రోజుల్లో ఐసీఎమ్మార్ బృందం వస్తుంది, వాళ్ళ పరిశీలన తర్వాత ఆయుర్వేద మందుపై నిర్ణయం ఉంటుంది.ఇలాంటి పరిస్థితుల్లో […]

అధికారులు, వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి అనిల్
విధాత : కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా ముందుకెళ్తున్నాం. ప్రభుత్వాసుపత్రిలో మరో ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. బ్లాక్ ఫంగస్ కేసుల కోసం ప్రత్యేకంగా 50 బెడ్లు ఏర్పాటు చేస్తున్నాం.పిల్లలకు కరోనా వస్తుందనే ప్రచారంతో కొంత అప్రమత్తమయ్యాం.ట్రీట్ మెంట్ కి అవసరమైన అన్ని సౌకార్యలు ముందుగానే చేస్తున్నాం.రెండు రోజుల్లో ఐసీఎమ్మార్ బృందం వస్తుంది, వాళ్ళ పరిశీలన తర్వాత ఆయుర్వేద మందుపై నిర్ణయం ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు రాజకీయాలు పక్కన పెట్టి సహకరించాలి.మేము మంచి చేశామా, తప్పు చేసామా అనేది వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారు.సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు ఎక్కువగా షేర్ చేస్తున్నారు.దీనివల్ల ప్రజలు భయపడే అవకాశాలు ఉన్నాయి.నిజానిజాలు తెలుసుకున్నాకే పోస్టులు పెట్టండి
కోవిడ్ బాధితులు ధైర్యంగా ఉండాలి, అండగా ప్రభుత్వం ఉంటుంది.