బీసీ వసతీగృహాల్లో నాణ్యమైన భోజనం

విధాత‌ : నేడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ . బుధవారం ఉదయం అనంతపురం అర్భన్ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డితో కలిసి అనంత నగరంలో విస్తృతంగా పర్యటించారు. అనంతపురంలోని బీసీ సంక్షేమ బాలికల హాస్టళ్లును సందర్శించారు. బాలికల హాస్టళ్ళల్లో విద్యార్ధినులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం విద్యార్ధినులతో ముచ్చటించారు. వారికి అందిస్తున్న సదుపాయాలు ఏవిధంగా వున్నాయని విద్యార్ధినులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం బీసీ వసతీగృహాల్లో […]

  • Publish Date - August 4, 2021 / 08:51 AM IST

విధాత‌ : నేడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ . బుధవారం ఉదయం అనంతపురం అర్భన్ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డితో కలిసి అనంత నగరంలో విస్తృతంగా పర్యటించారు. అనంతపురంలోని బీసీ సంక్షేమ బాలికల హాస్టళ్లును సందర్శించారు. బాలికల హాస్టళ్ళల్లో విద్యార్ధినులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం విద్యార్ధినులతో ముచ్చటించారు. వారికి అందిస్తున్న సదుపాయాలు ఏవిధంగా వున్నాయని విద్యార్ధినులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం బీసీ వసతీగృహాల్లో కల్పించేలా చర్యలు చేపట్టాలని, మెరుగైన మౌలిక వసతులు అందించేలా అధికారులను అదేశించారు. బీసీ హస్టల్స్, స్కూల్స్ లో ఆర్వో ప్లాంట్లను అమర్చాలని, తద్వారా విద్యార్ధులకు పరిశుభ్రమైన త్రాగునీరు, కనీస అవసరాలకు అందించడం ద్వారా ఆరోగ్యవంతులుగా వుంటారని, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు సాధ్యాసాద్యాలపై నివేదిక అందించమని అధికారులను ఆదేశించారు. బీసీ హాస్టల్స్, స్కూల్స్ లలో మరుగుదొడ్ల నిర్వహణ, శానిటైషన్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్భన్ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి, రజక కార్పోరేషన్ ఛైర్మన్ రంగన్న, కుంచితవక్కలింగా కార్పోరేషన్ డైరెక్టర్, జిల్లా బీసీ సంక్షేమశాఖ డిడి, స్ధానిక బీసీ నాయకులు, వైయస్సార్ సిపి పార్టీ కార్యకర్తలు పాల్గోన్నారు.