ఢిల్లీకి వెళ్లి అక్కడి నాయకులను బోషడీకే అని పిలుస్తారా..? : కన్నబాబు
విధాత: రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయని ఢిల్లీ వెళుతున్నామని చెబుతున్న చంద్రబాబు నాయుడు … రాష్ట్రపతిగారిని, ప్రధానమంత్రిని, అమిత్ షాని కలిసిన తర్వాత బాగున్నారా అని పలకరించడానికి మీరు ఏమని సంభోదిస్తారు. వారిని బోషడీకే అని పిలుస్తారా..? అని అన్నారు మంత్రి కన్నబాబు. మరి, ఇంట్లో మీ కొడుకు, మీ పార్టీ నేతలు బోషడికే అనే మిమ్మల్ని కూడా పిలుస్తారా? ఢిల్లీ వెళ్లి ఏం చెబుతారు? బోషడికే అంటే.. అక్కడ అది చాలా తీవ్రమైన పదం. చంద్రబాబు […]

విధాత: రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయని ఢిల్లీ వెళుతున్నామని చెబుతున్న చంద్రబాబు నాయుడు … రాష్ట్రపతిగారిని, ప్రధానమంత్రిని, అమిత్ షాని కలిసిన తర్వాత బాగున్నారా అని పలకరించడానికి మీరు ఏమని సంభోదిస్తారు. వారిని బోషడీకే అని పిలుస్తారా..? అని అన్నారు మంత్రి కన్నబాబు. మరి, ఇంట్లో మీ కొడుకు, మీ పార్టీ నేతలు బోషడికే అనే మిమ్మల్ని కూడా పిలుస్తారా? ఢిల్లీ వెళ్లి ఏం చెబుతారు? బోషడికే అంటే.. అక్కడ అది చాలా తీవ్రమైన పదం. చంద్రబాబు దీక్ష సందర్భంగా నిన్న చేసిన ప్రసంగం వింటుంటే నవ్వొస్తుంది. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనను సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. మీ ప్రభుత్వ హాయాంలో.. రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టడానికి వీల్లేదని చెప్పింది ఎవరు?. అదే నోటితో ఇప్పుడేమో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండా?
చంద్రబాబు దీక్ష సందర్భంగా.. సినిమాల్లో బ్రహ్మానందం కామెడీ సీన్లలో వచ్చినట్లు నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చాడు. లోకేష్ మాటలు చూస్తే… చంద్రబాబులాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదు అనిపించింది. నిన్న లోకేష్ మాట్లాడుతూ.. దుగ్గిరాలలో ఎంపీటీసీలు గెలిచామని, వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో గెలిచి వాళ్ల నాన్నకు గిఫ్ట్‌గా ఇస్తామని చెబుతున్నాడు. ఎవరైనా సరే టీడీపీని గెలిపించి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా చేస్తామని చెప్పడాన్ని గిప్ట్ అంటారా? ఎంపీటీసీలను గెలిపించాం.. అదే నీకు గిప్ట్ అని ఏ కొడుకు అయినా అంటాడా? అని కన్నబాబు ఎద్దేవా చేశారు.