లక్కీ బైక్ డ్రా పేరుతో డబ్బులు గోల్‌మాల్
విధాత,రంపచోడవరం : లక్కీ బైక్ డ్రా పేరుతో డబ్బులు గోల్‌మాల్ చేసి ప్రజలను మోసం చేసిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల క్రితం రంపచోడవరంలో తరుణి పేరుతో మోటార్ బైక్ షోరూంను ప్రారంభించాడు జువ్విన నాగేశ్వరరావు(నాగు) . వాహనాల విక్రయాలతో పాటు ‘లక్కీ డ్రా స్కీమ్‌ను ప్రారంభించి సుమారు 200మంది నుంచి నెలకు రూ.1,500ల చొప్పున 40నెలల పాటు డబ్బులు కట్టించుకున్నాడు. ప్రతినెల డ్రా నిర్వహించి 30 మందికి బైక్‌లను ఇచ్చాడు. ఆ తర్వాత […]

విధాత,రంపచోడవరం : లక్కీ బైక్ డ్రా పేరుతో డబ్బులు గోల్‌మాల్ చేసి ప్రజలను మోసం చేసిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల క్రితం రంపచోడవరంలో తరుణి పేరుతో మోటార్ బైక్ షోరూంను ప్రారంభించాడు జువ్విన నాగేశ్వరరావు(నాగు) .
వాహనాల విక్రయాలతో పాటు ‘లక్కీ డ్రా స్కీమ్‌ను ప్రారంభించి సుమారు 200మంది నుంచి నెలకు రూ.1,500ల చొప్పున 40నెలల పాటు డబ్బులు కట్టించుకున్నాడు. ప్రతినెల డ్రా నిర్వహించి 30 మందికి బైక్‌లను ఇచ్చాడు. ఆ తర్వాత ఎటువంటి డ్రాలు నిర్వహించకుండా ఏడాదిగా రంపచోడవరం రావడం మానేశాడు నాగు.
ఇది గమనించిన బాధితులు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఫోన్ల ద్వారా కోరగా కొంతమందికి నగదు ఇవ్వలేను… బైక్‌లు తీసుకోవాలని చెప్పాడు. దాంతో కొంతమంది బైక్‌లు తీసుకొన్నారు. మంగళవారం అర్ధరాత్రి షోరూంలోని సామగ్రిని లారీలో తరలించుకుపోతుండగా మిగతా బాధితులు సలాది బాపిరాజు ఆధ్వర్యంలో అతనిని అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో సామగ్రిని తీసుకెళ్తున్న లారీని స్టేషన్ కు తరలించి,బాధితులు తమకు జరిగిన అన్యాయంపై బుధవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో నిర్వహకుడు నాగు బుధవారం మధ్యాహ్నం రంపచోడవరం రావడంతో ఒక్కసారిగా బాధితులు చుట్టుముట్టి ఘర్షణకు దిగారు. దీనిపై స్థానిక సీఐ త్రినాథ్‌ను వివరణ కోరగా లక్కీ డ్రా పేరుతో డబ్బులు కట్టించుకొని మోసం చేశాడని తమకు ఫిర్యాదు అందిందని దీనిపై విచారణ జరిపి చర్యలు చేపడతామన్నారు.