విధాత:దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు స్వాతంత్య్రం పోవడం బాధాకరం.గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని బిల్డప్ ఇచ్చారు కదా ఇప్పుడు జగన్ రావడం లేదు గన్ను రావడం లేదన్నారు నారా లోకేష్.మధ్యాహ్నం కూడా పడుకుంటున్నాడు జగన్ రెడ్డి గారు.రమ్య హత్య జరిగిన 12 గంటల తరువాత సీఎం ట్వీట్ పెట్టారంటే మహిళల భద్రత పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధమవుతుంది. నిన్న హోంమంత్రి గారు మహిళల్ని హత్య చేసే హక్కెవరిచ్చారు అని అమాయకంగా అడుగుతున్నారు. ఆ మాట విన్న తరువాత నవ్వాలో,ఏడవాలో అర్ధం కాలేదు,మహిళల్ని హత్య చేసే హక్కు సీఎం జగన్ రెడ్డి గారే ఇచ్చారమ్మా సుచెరిత గారు.జగన్ రెడ్డి గారి ఇంట్లో మహిళలకు రక్షణ లేదు,ఇంటి పక్కన మహిళలకు రక్షణ లేదు,సొంత నియోజకవర్గంలో మహిళకు రక్షణ లేదు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెల్లెలు నాకు ఈ రాష్ట్రంలో రక్షణ లేదు అని చెప్పడం చరిత్రలో ఎప్పుడైనా చూసామా?,జగన్ రెడ్డి గారి చెల్లి వైఎస్ సునీతా రెడ్డి గారు నాకు ప్రాణ భయం ఉంది,రక్షణ కల్పించండి అని అడుగుతున్నారు.ఇక ఈ రాష్ట్రంలో సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.
సొంత చెల్లికే రక్షణ కల్పించలేని వాడు రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తాడు?
జగన్ రెడ్డి గారి ప్యాలస్ పక్కన మహిళ పై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకూ నిందితులను పట్టుకోలేకపోయారు. జగన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మ ని అత్యంత కిరాతకంగా చంపేస్తే ఈ రోజు వరకూ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు.కర్నూలు జిల్లా గొనెగండ్లలో మైనార్టీ యువతి హాజీరాని దారుణంగా చంపి ఏడాది అయ్యింది.ఆ కేసు ముందుకు కదలలేదు. అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలతని కిరాతకంగా చంపేసారు. విజయవాడ తేజశ్వని ని అత్యంత ఘోరంగా గొంతు కోసి చంపేసారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అనూష ని ఒక మృగాడు కిరాతకంగా చంపేసాడు.గాజువాక లో వరలక్ష్మిని బ్లేడ్ తో మెడ కోసి చంపేసాడు మరో మృగాడు.రోడ్ల పై కత్తులు పట్టుకొని మహిళల్ని వెంటాడుతున్నారు.కొన్ని ఘటనల్లో మా అమ్మాయికి ప్రాణ హాని ఉందని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని లోకేష్ మండిపడ్డారు.
ఇక మహిళల పై వైకాపా నాయకుల దాడులు,వేధింపులకు లెక్కే లేదు.ఒకటి,రెండూ కాదు రెండేళ్ల పాలనలో 500 కు పైగా ఘటనలు.వారానికో అత్యాచారం,15రోజులకో హత్య జరుగుతున్నా వైకాపా ప్రభుత్వంలో చలనం లేదు.నేను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని ఒక్కటే అడుగుతున్నా రెండేళ్ల మీ పరిపాలనలో ఒక్క మహిళకైనా న్యాయం జరిగిందా?ఒక్క నిందితుడికైనా శిక్ష పడిందా?దిశ చట్టం అన్నారు,21 రోజుల్లో నిందితులకు శిక్ష అన్నారు?ఇప్పటి వరకూ ఎంత మందికి శిక్ష పడిందో చెప్పే ధైర్యం ఉందా?దిశ చట్టం,దిశ యాప్ అని ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారు.కేంద్రమేమో అసలు ఆ చట్టమే లేదంటుంది. విచిత్రం ఏంటంటే వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. దిశ చట్టం పై కేంద్రం వివరణ అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన కూడా లేదని కేంద్రం సమాధానమిచ్చింది.
మహిళల రక్షణ పట్ల వీళ్లకున్న చిత్తశుద్ధి అది.దిశ చట్టం మహిళలకు రక్షణ కల్పించలేదు కానీ జగన్ రెడ్డి గారికి కాసులు కురిపించింది.దిశ చట్టం పేరు చెప్పి సొంత పత్రిక,ఛానల్ కి 30 కోట్లు ప్రకటనలు ఇచ్చుకున్నారు. ఇప్పుడు గుంటూరు లో దళిత యువతి రమ్య ని అత్యంత క్రూరంగా వెంటాడి చంపేసాడు మృగాడు.బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది,బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయిని చంపేసాడు.స్తోమతలేకపోయినా రమ్యని తల్లిదండ్రులు బాగా చదివించారు.తాడేపల్లి ప్యాలస్ గేటు బయటకి వస్తే జగన్ రెడ్డి గారికి వాస్తవాలు తెలుస్తాయి.ఆర్థిక సహాయం ప్రకటించా మీ చావు మీరు చావండి అని జగన్ రెడ్డి గారు అంటున్నారు. అయ్యా మీ డబ్బు,లేని మీ దిశ చట్టం,మీరు చనిపోయిన రమ్యని తిరిగి తీసుకురాగలరా?రమ్య తల్లితండ్రులకు ఎం సమాధానం చెబుతారు?,ఇదే కష్టం మీ ఇంట్లో వస్తే ఏంటని వైకాపా నేతలంతా ఆలోచించాలి.రాష్ట్ర పోలీసు శాఖని వైకాపా రక్షణ శాఖ గా మార్చేసారు. పోలీసులకు వైకాపా కండువా కప్పి టీడీపీ నాయకుల పై కక్ష సాధింపుకి ఉపయోగిస్తున్నారు. ఏ రోజు ఏ నాయకుడ్ని అరెస్ట్ చెయ్యాలి,ఎవరిని జైలుకి పంపాలి అనే బిజీలో పోలీస్ శాఖ ఉండి శాంతి భద్రతలను గాలికొదిలేసారు.పోలీసుల వ్యవహార శైలి వల్లే నేరస్తులు రెచ్చిపోతున్నారు.ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి మహిళల రక్షణ కి ప్రత్యేక ప్రణాళిక ప్రకటించాలి.