గిరిపుత్రులపాలిట అరాచకంగా ప్రవర్తించడం క్షమించరాని నేరం

విధాత‌: ఆదివాసులకు రక్షణగా ఉన్న చట్టాలను కాలరాస్తోంది జగన్ రెడ్డి ప్రభుత్వం. తమ మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చిన రంపచోడవరం ఐటీడీఏ తీరుపై ఉద్యమిస్తున్న గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపడం దారుణమ‌న్నారు నారా లోకేష్. చర్చల పేరుతో ఆహ్వానించి, పోలీసులతో నిర్బంధించి, నేరం చేసిన వాళ్లలా నేలపై గిరిజన ప్రతినిధుల్ని కూర్చోబెట్టి తీవ్రంగా అవమానించడం జగన్ రెడ్డి అధికార దర్పానికి పరాకాష్ట. గిరిజన అభ్యున్నతికి పాటుపడాల్సిన అధికారే ..గిరిపుత్రులపాలిట అరాచకంగా ప్రవర్తించడం క్షమించరాని నేరం. గిరిజనుల […]

  • Publish Date - August 24, 2021 / 08:47 AM IST

విధాత‌: ఆదివాసులకు రక్షణగా ఉన్న చట్టాలను కాలరాస్తోంది జగన్ రెడ్డి ప్రభుత్వం. తమ మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చిన రంపచోడవరం ఐటీడీఏ తీరుపై ఉద్యమిస్తున్న గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపడం దారుణమ‌న్నారు నారా లోకేష్. చర్చల పేరుతో ఆహ్వానించి, పోలీసులతో నిర్బంధించి, నేరం చేసిన వాళ్లలా నేలపై గిరిజన ప్రతినిధుల్ని కూర్చోబెట్టి తీవ్రంగా అవమానించడం జగన్ రెడ్డి అధికార దర్పానికి పరాకాష్ట. గిరిజన అభ్యున్నతికి పాటుపడాల్సిన అధికారే ..గిరిపుత్రులపాలిట అరాచకంగా ప్రవర్తించడం క్షమించరాని నేరం. గిరిజనుల హక్కులు కాపాడాలి, వారికి రక్షణగా ఉన్న చట్టాలు,జిఓలు పక్కాగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. లేటరైట్ పేరుతో సాగిస్తున్న బాక్సైట్ అక్రమమైనింగ్ దందాని జగన్ అండ్ కో తక్షణమే నిలిపివేయాలి.