నెల్లూరు: వరదలో చిక్కుకున్న వాహనం.. ఈదుకుంటూ వెళ్లి రక్షించిన పోలీసులు
విధాత: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో రోడ్లన్నీ జల పాతాలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం కురిసిన భారీ వర్షానికి తడ జాతీయ రహదారి పై బిగ్ స్టే సమీపంలో ఓ వాహనం నీటిలో చిక్కుకుపోయింది. సమాచారం తెలుసుకున్న తడ ఎస్సై శ్రీనివాసులు రెడ్డి ఆపద్బాంధవుడిలా తన సిబ్బందితో వచ్చి మారు మూడు అడుగుల లోతు నీటిలో ఈదుకుంటూ సమీపంలోని ప్రమాదకరమైన విద్యుత్ లైన్ ను సైతం లెక్క చేయకుండా వాహనం దగ్గరికి […]

విధాత: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో రోడ్లన్నీ జల పాతాలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం కురిసిన భారీ వర్షానికి తడ జాతీయ రహదారి పై బిగ్ స్టే సమీపంలో ఓ వాహనం నీటిలో చిక్కుకుపోయింది.
సమాచారం తెలుసుకున్న తడ ఎస్సై శ్రీనివాసులు రెడ్డి ఆపద్బాంధవుడిలా తన సిబ్బందితో వచ్చి మారు మూడు అడుగుల లోతు నీటిలో ఈదుకుంటూ సమీపంలోని ప్రమాదకరమైన విద్యుత్ లైన్ ను సైతం లెక్క చేయకుండా వాహనం దగ్గరికి వెళ్లి కారును వెనుకకు నెట్టి అందులోని ప్రయాణికులను రక్షించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయన సేవలను కొనియాడారు.