ఇంత చెత్త సీఎంను చూడలేదు..
*అధికారంతో మిడిసిపాటు*అన్నీ రాసి పెట్టుకుంటున్నాం.. వడ్డీతో బదులు తీరుస్తాం*మాకూ ఒక రోజు వస్తుందని గుర్తుంచుకోండి*వైసీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక*జనార్దన్‌రెడ్డి అరెస్టుపై ఆన్‌లైన్‌లో నిరసన దీక్ష*తప్పుడు కేసులు పెడితే పోలీసులపై ప్రైవేటు కేసులు*స్టేషన్లో కొడితే మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు*టీడీపీ అధినేత ఆగ్రహం ఈ రోజు ఎవరెవరు ఏం చేశారో అన్నీ గుర్తు పెట్టుకుంటున్నాం. రాసి ఉంచుకుంటున్నాం. అణిచివేతను, కక్ష సాధింపును అనుభవించిన ప్రతి టీడీపీ నాయకుడు, కార్యకర్త దానికి బదులు తీర్చుకుంటారని గుర్తుంచుకోండి. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు […]

*అధికారంతో మిడిసిపాటు
*అన్నీ రాసి పెట్టుకుంటున్నాం.. వడ్డీతో బదులు తీరుస్తాం
*మాకూ ఒక రోజు వస్తుందని గుర్తుంచుకోండి
*వైసీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక
*జనార్దన్‌రెడ్డి అరెస్టుపై ఆన్‌లైన్‌లో నిరసన దీక్ష
*తప్పుడు కేసులు పెడితే పోలీసులపై ప్రైవేటు కేసులు
*స్టేషన్లో కొడితే మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు
*టీడీపీ అధినేత ఆగ్రహం
ఈ రోజు ఎవరెవరు ఏం చేశారో అన్నీ గుర్తు పెట్టుకుంటున్నాం. రాసి ఉంచుకుంటున్నాం. అణిచివేతను, కక్ష సాధింపును అనుభవించిన ప్రతి టీడీపీ నాయకుడు, కార్యకర్త దానికి బదులు తీర్చుకుంటారని గుర్తుంచుకోండి.
రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు ఉండకూడదని టీడీపీ శ్రమించి పనిచేసి వాటిని రూపుమాపింది. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వేధింపు రాజకీయాలు మొదలయ్యాయి.
విధాత :అమరావతి, అధికారం చేతిలో ఉందని వైసీపీ నేతలు మిడిసిపడుతున్నారని.. వారి ప్రతి అరాచకానికీ వడ్డీతో బదులు తీరుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా బుధవారం టీడీపీ నిర్వహించిన ఆన్‌లైన్ నిరసన దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘అధికారం అండతో ప్రభుత్వ టెర్రరిజాన్ని ప్రదర్శిస్తున్నారు. నాయకులను అణచివేస్తే టీడీపీ ఉండదని భ్ర మిస్తున్నారు. ఎంత అణిచివేస్తే అంత బలంగా పోరాడే శక్తి టీడీపీ శ్రేణులకు ఉంది. గడియారం తిరుగుతూనే ఉంటుంది.
ఒక రోజు మాకూ వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ‘మనపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసు వేసే హక్కు మనకు ఉంది. ఎంతవరకై నా వెళ్లి పోరాడదాం. స్టేషన్లో పోలీసులు కొట్టినా ఊరుకోవలసిన అవసరం లేదు. నిర్భయంగా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయండి. అక్కడ న్యాయం జరగకపోతే ఇం కా పైకి వెళ్దాం. ఎంపీ రఘురామరాజును పోలీసు కస్టడీలో కొట్టించారు. ఆర్మీ ఆస్పత్రిలో నిజాలు బయటకు వచ్చి ముఖ్యమంత్రి బోనులో నిలబడ్డారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతివారూ పోరాడాలి. పోలీసుల్లో కొందరు మరీ అతిగా పోతున్నారు. వారందరినీ గుర్తు పెట్టుకుంటు న్నాం. ప్రభుత్వం మారితే మీ పరిస్థితేం టో ఆలోచించుకోండి. మీకు జీతాలు ఇస్తోంది ప్రజలు తప్ప వైసీపీ నేతలు కాదు. మరీ ఎక్కువ చేస్తే తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది’ అని ఆయన హెచ్చరించారు.
ఇంత చెత్త సీఎంను చూడలేదు..
కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడే పనిని వదిలిపెట్టి రాజకీయ కక్ష సాధింపులపై జగన్‌రెడ్డి దృష్టి పెట్టి పనిచేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ తన రాజకీయ చరిత్రలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసిందని, కానీ ఇంత చెత్త ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు. ‘కరోనా వచ్చిన పేదలు, మధ్య తరగతి ప్రజలు చికిత్స కోసం అల్లాడుతున్నారు. డబ్బులు లేకపోతే ప్రాణాలు నిలబడే పరిస్థితి లేదు. పడకలు దొరకవు… ఆక్సిజన్ దొరకదు. ఇవేవీ ఈ సీఎంకు పట్టవు. ఉన్మాద పాలనకు కేరాఫ్ అడ్ర్‌సగా మారింది’ అని విమర్శించారు. కేసులు, అరెస్టులకు భయపడవద్దని…భయపడి ఇంట్లో దాక్కుంటే ఇంకా మీద పడతారని, అందరూ కలిసి తిరగబడితేనే వెనక్కి తగ్గుతారని పార్టీ శ్రేణులకు సూచించారు. బీసీ జనార్దన్‌రెడ్డి ఏనాడూ ఫ్యాక్షన్ రాజకీయాల జోలికి పోలేదని, సొంత డబ్బులతో నియోజకవర్గం అభివృద్ధికి పనిచేశారని గుర్తుచేశారు.