సైబ‌ర్ నేరాలపై జిల్లా పోలీసు అధికారులకు వన్డే వర్క్ షాప్

విధాత‌: నేడు మారుతున్న జీవితంలో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది, ప్రతి ఒక్కరి శరీరంలో ఒక భాగం లా మారిపోయింది. అలాంటి నిత్యావసరం గా మారిన ఫోన్ వలన అనేక అనర్ధాలు, సైబర్ నేరాలకు గురవుతూ తీవ్ర మానసిక క్షోభకు సామాన్య ప్రజలు గురవుతున్నారని, అలాంటి నేరాల బారిన పడిన ప్రజలు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు వాటిని ఏవిధంగా పరిష్కరించాలి. అలాంటి వాటిని అతి తక్కువ సమయంలో ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనే అంశంపై […]

సైబ‌ర్ నేరాలపై జిల్లా పోలీసు అధికారులకు వన్డే వర్క్ షాప్

విధాత‌: నేడు మారుతున్న జీవితంలో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది, ప్రతి ఒక్కరి శరీరంలో ఒక భాగం లా మారిపోయింది. అలాంటి నిత్యావసరం గా మారిన ఫోన్ వలన అనేక అనర్ధాలు, సైబర్ నేరాలకు గురవుతూ తీవ్ర మానసిక క్షోభకు సామాన్య ప్రజలు గురవుతున్నారని, అలాంటి నేరాల బారిన పడిన ప్రజలు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు వాటిని ఏవిధంగా పరిష్కరించాలి. అలాంటి వాటిని అతి తక్కువ సమయంలో ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనే అంశంపై జిల్లాలో గల పోలీసు అధికారులు అందరికీ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ వ‌ర్క షాప్ నిర్వహించగా, ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్ఐ స్థాయి నుండి డీఎస్పీ స్థాయి అధికారులు హాజరయ్యారు.

విజయవాడ సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి కాలంలో సైబర్ నేరాలు ఏవిధంగా జరిగేది, ఎలాంటి నేరాల్లో సామాన్య ప్రజలు, విద్యావంతులు తేలికగా చిక్కుకుంటున్నారు, అలాంటి ఫిర్యాదులను స్వీకరించే టప్పుడు ఆఫీసర్ పాటించవలసిన నియమాలు, అలాంటి తరహా నేరాల లో ఏ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని సేకరించి కేసు దర్యాప్తు వేగంగా పూర్తి చేయవచ్చు, అలాగే ఏవిధమైన సమాచారాన్ని వివిధ సాధనాల ద్వారా సేకరించవచ్చు అనే అంశాలను కూలంకషంగా వివరించారు. అంతేకాక గతంలో జరిగిన కొన్ని రకాల కేసులను వివరించి ఆ కేసులో ఏవిధంగా దర్యాప్తు చేసింది. కొన్ని కేస్ స్టడీస్ అధికారులకు తెలియజేశారు.

అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎఫ్.ఎస్.ఎల్.శివ ప్రసాద్ మాట్లాడుతూ నేటి కాలంలో సామాన్య ప్రజల నుండి ఉద్యోగాలు చేసే విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు అధిక శాతం మంది సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను ఎరగా చేసుకొని అనేక మంది సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఏవిధంగా సైబర్ నేరస్తుల చేతికి చిక్కుతాము, అలాంటి నేరాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా దర్యాప్తు అధికారి విచారణ చేపట్టాలి, అలాంటి కేసులలో మూలాధారమైన, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా ఆధారాలను ఏవిధంగా సేకరించి, వాటిని ప్రయోగశాలకు పంపుతారు, ఆ పరికరాల నుండి వారు సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తారు. వాటి ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తూ బాధితులకు న్యాయం చేయగలం అనే అంశాల గురించి వివరించారు.

డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఏదైనా నేరం జరిగినప్పుడు నేర స్థలంలో ఉన్న ఆధారాలను ఏవిధంగా సేకరించాలి, సేకరించిన ఆధారాలు ఒక క్రమపద్ధతిలో ప్రయోగశాలకు ఏ విధంగా పంపించాలి. అనంతరం ప్రయోగశాల నుండి ఆధారాలను ఏ డాక్యుమెంట్ రూపంలో సేకరించుకోవాలి అనే అంశాలను తెలుపుతూ, సేకరించిన ఆధారాల ద్వారా ఆధారాలను నేరానికి మరియు నేరం చేసిన నేరస్థుడికి ఏవిధంగా జత చేయాలి అనే అంశాలపై కూలంకషంగా వివరించారు.

ఐ క్యూబ్ సొల్యూషన్స్ ప్రిన్సిపల్ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని నేరాల్లో మొబైల్ ఫోన్ చాలా కీలకంగా మారుతుందని, అలాంటి సమయంలో మొబైల్ సిగ్నల్ ను ఏ విధంగా ట్రాక్ చేయాలి, ఆ సిగ్నల్స్ను ఉపయోగించుకుంటూ నేరానికి పాల్పడిన ముద్దాయి ఫోన్ నెంబర్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నది లేనిది, నేరం జరిగిన సమయానికి ముందు తరువాత ఆ ప్రాంతంలో ఏ ఏ సమయాల్లో సంచరించాడో అనే విషయం తెలుసుకోవడం లో మొబైల్ సిగ్నల్ చాలా కీలకం గా వ్యవహరిస్తారని, ఆ సమయంలో సి డి ఆర్ ద్వారా నేరస్తుడిని తేలికగా అదుపులోకి తీసుకునే అవకాశం కుదురుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ , డిఎస్పీ లు ధర్మేంద్ర, మాసూం భాష, మహబూబ్ బాషా , సత్యానందం , శ్రీనివాసులు, నాగేశ్వర రెడ్డి,మురళీకృష్ణ , రమేష్, రాజీవ్ కుమార్, భరత్ మాతా జి, విజయ్ కుమార్ , అన్ని విభాగాల ఇన్స్పెక్టర్లు, సర్కిల్స్ సిఐలు, ఆర్ ఐ లు, ఎస్సైలు ఆర్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.