వరి రైతులకు ఉరేనా..
విధాత: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలలో పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఆరుగాలం శ్రమించి తీరా పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు కురవడంతో రైతు శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది.కురుస్తున్న వర్షానికి కొన్ని చోట్ల వరి మోత్తం నేలమట్టం కాగా పండించిన అన్నధాతకు కన్నీరే మిగిలింది.ఇది ఇలా ఉండగా తెలంగాణలో వడ్లు అమ్ముకొనుటకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఐకేపీ కేంద్రాల వద్ద మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నారు.వర్షాల కారణంగా […]

విధాత: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలలో పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఆరుగాలం శ్రమించి తీరా పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు కురవడంతో రైతు శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది.కురుస్తున్న వర్షానికి కొన్ని చోట్ల వరి మోత్తం నేలమట్టం కాగా పండించిన అన్నధాతకు కన్నీరే మిగిలింది.ఇది ఇలా ఉండగా తెలంగాణలో వడ్లు అమ్ముకొనుటకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఐకేపీ కేంద్రాల వద్ద మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నారు.వర్షాల కారణంగా మార్కెట్ లల్లో ఎండబోసిన వడ్లు తడిసి మోలకెత్తుతున్నా పట్టిచ్చుకునే నాథుడు లేడని రైతులు గోడు వెల్లబోసుకుంటున్నారు అయినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోక పోగా నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారాన్ని కూడా ప్రకటించలేదు..