Amaravathi | చంద్రబాబును ఆకాశానికెత్తేసిన మోదీ.. ఆ పని ఆయనను చూసే చేశానని వెల్లడి
Amaravathi | ‘‘ఎన్టీఆర్.. వికసిత ఏపీ కోసం కలలుగన్నారని..మనమందరం కలిసి ఆయన కలల్ని నిజం చేయాలని నరేంద్ర మోదీ తెలిపారు. వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా ఎదగాలన్నారు. పవన్ కల్యాణ్ గారూ ఇది మనం చేయాలి. మనమే చేయాలని మోదీ తెలుగులో స్పష్టం చేశారు.
Amaravathi | అమరావతి రాజధాని ఒక నగరం కాదని..ఒక శక్తి అని స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏపీని ఆధునిక ప్రదేశ్, అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతి అని..వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు. శుక్రవారం అమరావతి రాజధాని పునఃప్రారంభోత్సవ సభలో ప్రధాని మోదీ రాజధాని నిర్మాణ పనుల్లో భాగంగా 57,962కోట్ల పనులకు శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ ప్రసంగించారు. తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టిన ప్రధాని.. దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిలోమిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది’ అన్నారు. ఇంద్రలోకం రాజధాని అమరావతి..ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతేనన్నారు. అమరావతి ఒక అధునాతన నగరం అని , ఆధునిక ఆంధ్ర ప్రదేశ్ కి ఒక కీలక పాత్ర పోషించబోతోందన్నారు. యువత కలలు సాకారమయ్యే రాజధానిగా అమరావతి ఎదుగుతుందని..ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకూ అమరావతి గమ్య స్థానంగా మారుతుందని విశ్వాం వ్యక్తం చేశారు. హరితశక్తి, స్వచ్ఛ పరిశ్రమలు, విద్య, వైద్య కేంద్రంగా అమరావతి ఎదుగనుందని.. అమరావతిలో మౌలికవసతుల కల్పనకు కేంద్ర సహకరిస్తుంది అని చెప్పారు.
చంద్రబాబు సమర్ధ పాలకుడు
చంద్రబాబు మంచి పరిపాలన దక్షుడని…అయితే టెక్నాలజీ నాతో మొదలైనట్లు చంద్రబాబు ప్రశంసించారని.. నిజానికి నేను గుజరాత్ సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకుని ఆయన టెక్నాలాజీని అనుసరించేవాడినని మోదీ వెల్లడించారు. అధికారుల్ని పంపించి హైదరాబాద్ ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయించానన్నారు. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా.. త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యమన్నారు. పెద్ద పెద్ద పనుల్ని చేపట్టి పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరని మోదీ కితాబిచ్చారు. 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశానని.. గత పదేళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచిందన్నారు. ఇప్పుడూ అమరావతిలో అన్ని రకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాటు అందిస్తుంది’’ అన్నారు.
చంద్రబాబుజీ..పవన్ జీ.. ఇది మనమే చేయాలి..
‘‘ఎన్టీఆర్.. వికసిత ఏపీ కోసం కలలుగన్నారని..మనమందరం కలిసి ఆయన కలల్ని నిజం చేయాలని నరేంద్ర మోదీ తెలిపారు. వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా ఎదగాలన్నారు. పవన్ కల్యాణ్ గారూ ఇది మనం చేయాలి. మనమే చేయాలని మోదీ తెలుగులో స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచిందని.. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం రూ.వేల కోట్లు సాయం చేస్తోందని గుర్తు చేశారు. ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నప్పుడు నాకు కనబడుతున్నది ఒక్క నగరం మాత్రమే కాదు.. ఒక స్వప్నం సాకారాం కాబోతోందనే భావన కలుగుతోందన్నారు. దాదాపు రూ.60వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నామని. ఇవి కేవలం కాంక్రీటు నిర్మాణాలు కాదు.. ఏపీ ప్రగతి, ఆశలు, వికసిత్ భారత్ ఆశయాలకు బలమైన పునాది వేయబోతున్నాయన్నారు. వీరభద్ర స్వామి, అమరలింగేశ్వరస్వామి, తిరుపతి వెంకటేశ్వరస్వామికి పాదాలకు నమస్కరిస్తూ ఏపీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. చంద్రబాబు, పవన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు.
విశాఖలో యోగా డేకు హాజరవుతా
విశాఖలో జూన్ 21న జరగనున్న యోగా డేలో పాల్గొంటాననని.. నన్ను ఆహ్వానించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలని మోదీ చెప్పారు. మన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని.. వచ్చే 50 రోజులూ ఏపీలో యోగాకు అనుకూల వాతావరణం కల్పించాలన్నారు. ఏపీలో కలలు కనేవాళ్ల సంఖ్య తక్కువేం కాదు.. ఆ కలల్ని నిజం చేసేవారి సంఖ్యా తక్కువకాదు. ఏపీ సరైన మార్గంలో నడుస్తోందని.. సరైన వేగంతో ముందుకెళ్తోంది. దీన్నికొనసాగించాలి. మూడేళ్లలో అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని సీఎం అన్నారని.. ఆ పనులు పూర్తయ్యాక ఏపీ జీడీపీ ఏ స్థాయికి వెళ్తుందో నేను ఊహించగలను. అది ఏపీ రాష్ట్రం చరిత్ర గతిని మార్చబోతోంది. ఏపీ అభివృద్ధిలో మీ భుజంతో కలిపి నా భుజం కలిపి పనిచేస్తాను. అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు’’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Bhu Bharathi | అలా చేస్తే అసైన్డ్ పట్టాలు రద్దు : మంత్రి పొంగులేటి
DOST | దోస్త్ షెడ్యూల్ విడుదల.. కావాల్సిన ధృవపత్రాలు ఏంటి..? దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
Another SkyLab | పది పదిహేను రోజుల్లోనే భూమిపై పడనున్న మరో ‘స్కైలాబ్’.. పడేది ఎక్కడంటే..
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram