‘పోలవరం ప్రాజెక్ట్‌కు రూ. 55వేల కోట్లు ఇవ్వాలి’
లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎంపీలు విధాత,న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినా.. కేంద్రం పటించుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీలు వంగా గీత, చంద్రశేఖర్, గురుమూర్తి.. పోలవరం ప్రాజెక్ట్ అంశం మీద లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.‘‘పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పోలవరంకు 55వేల కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలి. […]

లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎంపీలు
విధాత,న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినా.. కేంద్రం పటించుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీలు వంగా గీత, చంద్రశేఖర్, గురుమూర్తి.. పోలవరం ప్రాజెక్ట్ అంశం మీద లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
‘‘పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పోలవరంకు 55వేల కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలి. 29 నెలలు గడిచినా ఇంకా పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించలేదు. పోలవరం ప్రాజెక్టు ఆఫీస్‌ను రాజమండ్రికి తరలించాలి’’ అని కోరినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు తెలిపారు.