విధాత:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు శుక్రవారం కలిశారు. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధును సీఎం అభినందించి ఆమెను సత్కరించారు. దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని సీఎం అభినందించారు. విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలన్నారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారు కావాలని జగన్ ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదును అధికారులు అందించారు.
ఈ సందర్భంగా పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్‌ను కలవడం ఆనందంగా ఉందని ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సీఎం జగన్ శుభాకాంక్షలుతెలిపారని, ఒలింపిక్స్‌లో మెడల్ తీసుకురావాలని కోరారని ఆమె తెలిపారు. ఏపీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని. ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌కు 2 శాతం రిజర్వేషన్ గొప్ప విషయం అని పేర్కొన్నారు. అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని.. త్వరలోనే అకాడమీ ప్రారంభిస్తానని పీవీ సింధు తెలిపారు.