రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిష‌న్ కొట్టివేత‌

విధాత‌(హైద‌రాబాద్‌): ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసింది. హౌస్ మోషన్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ బెయిల్ కోసం సిఐడి కోర్టులో ప్రయత్నించమని ఆదేశించింది.. అంత‌కుముందు రఘురామకృష్ణంరాజు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ జ‌రిగింది.. జిల్లా కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకువచ్చారని ప్రశ్నించింది. ప్రాథమిక విచారణ, ఆధారాలు లేకుండా ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ చేశారన్న లాయర్. ఎంపీ హోదా ఉన్న వ్యక్తిని కారణాలు లేకుండా.. రిమాండ్‍కు పంపాలనుకోవడం చట్టవిరుద్ధమన్న రఘురామ లాయర్. ప్రభుత్వం, పోలీసుశాఖ తరపున […]

రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిష‌న్ కొట్టివేత‌

విధాత‌(హైద‌రాబాద్‌): ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసింది. హౌస్ మోషన్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ బెయిల్ కోసం సిఐడి కోర్టులో ప్రయత్నించమని ఆదేశించింది.. అంత‌కుముందు రఘురామకృష్ణంరాజు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ జ‌రిగింది.. జిల్లా కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకువచ్చారని ప్రశ్నించింది.

ప్రాథమిక విచారణ, ఆధారాలు లేకుండా ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ చేశారన్న లాయర్. ఎంపీ హోదా ఉన్న వ్యక్తిని కారణాలు లేకుండా.. రిమాండ్‍కు పంపాలనుకోవడం చట్టవిరుద్ధమన్న రఘురామ లాయర్. ప్రభుత్వం, పోలీసుశాఖ తరపున ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాద‌న‌లు విన్న హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ బెయిల్ కోసం సిఐడి కోర్టులో ప్రయత్నించమని ఆదేశించింది.