ఏపీ రాజధాని అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం. రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి అధికారిక రాజధానిగా అమల్లోకి రానుంది.

Amaravati As AP capital

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశ పెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో బిల్లును ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి బిల్లుపై చర్చను ప్రారంభించారు. మొత్తం 11 పార్టీలకు చెందిన 17 మంది ఎంపీలు బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. 10 పార్టీలకు చెందిన ఎంపీలు బిల్లుకు మద్ధతు తెలపగా, వైసీపీ ఎంపీలు బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరావతికి వెంకటేశ్వర స్వామి ఆశిస్సులు ఉంటాయన్నారు. ఎంపీలు లక్ష్మణ్, ఆర్. కృష్ణయ్య, కేంద్ర మంత్రి రామ్మెహన్ నాయుడు బిల్లుకు మద్ధతుగా మాట్లాడారు. అమరావతి రాజధాని చట్టబద్దత బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలపడంతో..బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గేజిట్ నోటిపికేషన్ విడుదల కానుంది. దీంతో ఏపీ అధికారిక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి రాజధాని బిల్లు ఏకగ్రీవంగా పాస్ కావడంతో రాజధాని ప్రాంత ప్రజల్లో సంబరాలు మిన్నంటాయి.

చారిత్రాక ఘట్టం : చంద్రబాబు ట్వీట్

అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ అమోదం తెలుపడం పై ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది ఒక చారిత్రాత్మకమైన మరియు నిర్ణయాత్మకమైన ఘట్టం అని ట్వీట్ చేశారు. అమరావతి బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో, మన ప్రజల సమిష్టి సంకల్పం అన్నారు. ప్రజల ఆకాంక్షలు జాతీయ స్థాయిలో ఒక బలమైన గళాన్ని వినిపించాయని అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి :

Amaravati Capital Bill : రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం
కేరళం ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Latest News